జిల్లాలో మతసామరస్యాలు వెల్లివిరిసే విధంగా అన్ని వర్గాలకు సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ పధకాలు

 

నెల్లూరు (ప్రజా అమరావతి);


జిల్లాలో  మతసామరస్యాలు వెల్లివిరిసే విధంగా అన్ని వర్గాలకు సంబంధించిన  అభివృద్ధి, సంక్షేమ పధకాలు


నెల్లూరు  రూరల్ నియోజక వర్గ పరిధిలో బాగా అమలు జరుగుచున్నవని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రొసెసింగ్ మంత్రి శ్రీ కాకాణి  గోవర్ధన్ రెడ్డి  తెలిపారు. 


శనివారం ఉదయం నెల్లూరు  రూరల్ నియోజక వర్గ పరిధిలోని 36వ డివిజన్ లోని రైతు బజారు వద్ద 50 లక్షల రూపాయలతో చేపట్టనున్న సైడు మురుగు కాలువల నిర్మాణానికి   మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి  శంఖుస్థాపన చేశారు. అనంతరం  ఫత్తేఖాన్ పేట వద్ద  కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన  క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ ను మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు.  ఈ సంధర్బంగా మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో  మాట్లాడుతూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో   మతసామరస్యాలు వెల్లివిరిసే విధంగా అన్ని వర్గాలకు సంబంధించిన  అభివృద్ధి, సంక్షేమ పధకాలు బాగా అమలు  జరుగుచున్నవన్నారు.   రాష్ట్ర ప్రభుత్వం పార్టీలకతీతంగా, అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు.  ఈ రోజు  అభివృద్ది కార్యక్రమంలో భాగంగా నెల్లూరు  రూరల్ నియోజక వర్గ పరిధిలోని 36వ డివిజన్ లో 50 లక్షలతో  సైడు మురుగు కాలువల నిర్మాణానికి    శంఖుస్థాపన చేసుకోవడం,  ఒక కోటి రూపాయలతో  నిర్మించిన  క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించుకోవడం జరిగిదన్నారు. నెల్లూరు  రూరల్ నియోజక వర్గ పరిధిలో ధీర్గకాలంగా అపరిష్కృతంగా వున్న  సమస్యలపై  దృష్టి  సారించి ఆ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మంత్రి ఈ సంధర్బంగా మంత్రి తెలిపారు. నిరంతరం నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి రాష్ట్ర మంత్రిగా ఎప్పుడూ నా సహాయ సహకారాలు ఉంటాయని మంత్రి  శ్రీ గోవర్ధన్ రెడ్డి అన్నారు. 


నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ రోజు 36 డివిజన్ పరిధిలో  50 లక్షల రూపాయలతో నిర్మించనున్న సైడు మురుగు కాలువల నిర్మాణానికి మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి గారి చేతుల మీదుగా శంఖుస్థాపన చేసుకోవడం, అలాగే కోటి రూపాయలతో నిర్మించిన క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ ప్రారంభించుకోవడం జరిగిదన్నారు.  క్రైస్తవుల సంబందించి మరో  100 సంవత్సరాల పాటు ఇబ్బందులు లేకుండా నియోజకవర్గంలోని అల్లిపురం దగ్గర  అన్ని మౌలిక వసతులతో నాణ్యతా ప్రమాణాలతో ఏర్పాటుచేస్తున్న క్రిస్టియన్ సమాధులతోటను నవంబర్ 2వ తేదీన సమాధుల పండుగ రోజున ప్రారంభించడం జరుగుతుందన్నారు. కల్లూరుపల్లి, కొత్తూరు ప్రాంతాలలో క్రిస్టియన్ సమాధులతోటల నిర్మాణానికి   తన వంతు కృషి చేయడం జరుగుతుందని  శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. 


ఈ కార్యక్రమాల్లో  జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు,  నగర మేయర్ శ్రీమతి పోట్లూరి స్రవంతి, నగర పాలక సంస్థ కమీషనర్ శ్రీమతి హరిత, ఆర్.డి.ఓ శ్రీ మలోల, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి శ్రీమతి కనక దుర్గా భవాని,  కార్పొరేటర్ శ్రీమతి  పిండి శాంతిశ్రీ,  తదితరులు పాల్గొన్నారు.



Comments