ఏ ఒక్క తల్లి, బిడ్డ చనిపోకుండా చూడాలి*
*: తల్లుల ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షిస్తుండాలి
*
*: జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్*
పుట్టపర్తి , సెప్టెంబర్ 30 (ప్రజా అమరావతి):
మాత శిశు మరణాలు అరికట్టడంలో భాగంగా ఏ ఒక్క తల్లి, బిడ్డ చనిపోకుండా చూడాలని, ఇందుకోసం అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం పుట్టపర్తి మండలంలోని ఎనములపల్లి గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అంగన్వాడి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి తల్లి, బిడ్డ మరణాలు జరగడానికి వీలు లేదన్నారు. తల్లిబిడ్డల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు వారి పరిధిలోని తల్లిబిడ్డల ఆరోగ్యంపై నిరంతరం శ్రద్ధ పెట్టాలన్నారు. గర్భవతులకు రక్తహీనత ఉందా, లేదా, బిడ్డకు బరువు తక్కువ ఉందా, తదితర అన్ని రకాల అంశాలపై దృష్టి పెట్టాలని, వారి ఆరోగ్యం పై నిరంతరం పర్యవేక్షిస్తే ఎలాంటి మరణాలు సంభవించేందుకు వీలు ఉండదన్నారు. తల్లులు గర్భిణిగా ఉన్నప్పటి నుంచి డెలివరీ అయ్యేంతవరకు వారిని పర్యవేక్షిస్తూ ఉండాలని, జన్మనిచ్చిన తల్లి మొదటి గంటలోపు తల్లి పాల ను ఇవ్వాలి. పిల్ల లకు మూడు సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు మంచి పౌష్టికాహారం అందించాలని తెలిపారు. ఆ వయసులో పిల్లలు పెరుగుదల ఎంతో ఉంటుందని తెలిపారు. ఆరు నెలల నుంచి ఇరవై మూడు నెలల మధ్య వయసు గల చిన్నారులకు తల్లి పాలతో పాటు. పౌష్టిక మైన ఆహారం అందజేయాలని తెలిపారు. బిడ్డ పుట్టినప్పటి నుంచి ప్రతి నెల బరువు నమోదు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం వైయస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ మరియు వైయస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం పటిష్ఠంగా అమలు చేయుచున్నది తెలిపారు. ప్రకృతిలో దొరికే ఆకుకూరలు గురించి వాటి పోషక విలువల గురించి గర్భిణీలకు మరియు పాలిచ్చే తల్లులకు, అంగన్వాడీ సిబ్బంది తెలియజేయాలని తెలిపారు. అంగన్వాడీ వ్యవస్థ పటిష్టంగా పని చేస్తే మంచి ఫలితాలు జిల్లాలో సాధించడం జరుగుతుందని తెలిపారు. నూతన జిల్లాలో ఇప్పటివరకు వివిధ కారణాల వలన 12 మంది శిశువులు మరణించారని, నలుగురు తల్లులు మరణించారని గణాంకాలు చెబుతున్నాయని తెలిపారు. వీటిపై ప్రతి నెల సమీక్ష సమావేశం నిర్వహించి మరణాలు తగ్గించడానికి పలు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. తల్లులకు ఏదైనా ప్రమాదం ఉన్నట్టు అనిపిస్తే వెంటనే డాక్టర్ల వద్దకు చూపించాలన్నారు. గ్రామస్థాయి నుంచి వారు పట్టణాలకు నగరాలకు వైద్యం కోసం వెళ్లే లోపు ఇబ్బందులు, పడాల్సి వస్తుందన్నారు. ప్రతినెలా వారి ఆరోగ్యం పై పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రతి బిడ్డ, ప్రతి గర్భిణీ, ప్రతి బాలింత కు సంబంధించిన రికార్డులన్నీ అంగన్వాడీ కేంద్రాలలో, మరి ఏ ఎన్ ఎం దగ్గర అందుబాటులో ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
ఈ సమావేశంలో ICDS పి డి రెడ్డి రమణమ్మ, సిడిపిఓ, శాంతకుమారి, డాక్టర్ నాగరాజు నాయక్, మహేష్, కాంతమ్మ, పరిమళ, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ఎనుములపల్లి గ్రామంలోని రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు. రబీ సీజన్ రానున్న నేపథ్యంలో రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు రైతు భరోసా కేంద్రంలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఇందులో అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించరాదని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. రైతు భరోసా కేంద్రం నుంచి రైతులు సాగు చేసే పంటలకు అవసరమైన సలహాలు సూచనలు అందించాలన్నారు. అనంతరం పుట్టపర్తి తాసిల్దార్ కార్యాలయం సందర్శించారు, రికార్డ్స రూము, సిబ్బంది కేటాయించిన గదులను పరిశీలించారు,
ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి, సుబ్బారావు, తాసిల్దార్ భాస్కర్ నారాయణ,అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment