ప్రజా సమస్యలు పరిష్కార వేదిక స్పందనలో వచ్చిన ప్రతి అర్జీని ఆయాశాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి దరఖాస్తుదారుని సమస్యను నిర్ణీత సమయంలో పరిష్కరించి ఫోటోతో కూడిన పరిష్కార పత్రాన్ని వైబ్ సైట్ లో అప్ లోడ్ చెయ్యాలని జిల్లా కలెక్టరు బసంతకుమార్ ఆదేశించారు.
స్పందన అర్జీలను సత్వర పరిష్కారం
జిల్లా కలెక్టర్ బసంత కుమార్
పుట్టపర్తి, సెప్టెంబర్ 19 (ప్రజా అమరావతి): స్పందన అర్జీలను సత్వరమే పరిష్కారం మార్గంచూపాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ అధికారులను ఆదేశించారు
సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో 252అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించడం జరిగింది. జిల్లా కలెక్టర్ తో పాటు అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో,డిఆర్వో పి కొండయ్య, పుట్టపర్తి ఆర్డిఓ భాగ్య రేఖవివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.*
*ఈ సందర్భంగా జిల్లాలోని ఆయా మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రజా సమస్యల పరిష్కారంనికి శ్రీకారం చుట్టిందన్నారు. అధికారులందరూ స్పందన కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకొని ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం లో వచ్చిన అర్జీలను శనివారం లోపల పరిష్కారం అయ్యేటట్లు చూడాలని అధికారులను ఆదేశించారు రీ ఓపెన్ క్యాటగిరిలో మళ్లీ అర్జీలు మళ్లీ రాకుండా నాణ్యమైన పరిష్కారం చూపించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. స్పందన గ్రీవెన్స్ అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని, సకాలంలో అర్జీలను పరిష్కరించాలన్నారు. అర్జీలను పరిష్కరించడంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదన్నారు. జిల్లా అధికారులు వారి శాఖ పరిధిలో ఉన్న గ్రీవెన్స్ లను నిత్యం మానిటర్ చేస్తూ నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించేలా చూడాలన్నారు. స్పందనలో ఈ రోజు 252 అర్జీలు వచ్చాయని, స్పందనలో వచ్చే ప్రతి ఫిర్యాదును ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి పరిష్కారం చూపాలన్నారు. జిల్లా, డివిజన్, మండల, సచివాలయ స్థాయిలో వచ్చిన అర్జీలను పరిష్కరించి సదరు లబ్దిదారుల ఫోటోతో కూడిన వివరాలు సంబందించి స్పందన వెబ్ సైట్ లో పొందు పర్చాలని జిల్లా కలెక్టరు బసంతకుమార్ స్పష్టం చేసారు. స్పందనలో వచ్చే ఫిర్యాదుల్లో రెవెన్యూ పరమైన భూ సమస్యలు, పంచాయితీ రాజ్ శాఖకు సంబందించి అధిక శాతం పిర్యాదులు వస్తున్నాయన్నారు. వాలెంటీర్లు, రెవెన్యూ అధికార్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వివిధ శాఖలకు సంబంధించి పెండింగ్ లో గల అర్జీలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యల పరిష్కారానికి అర్జీ దారునియొద్దకు విచారణకు వెళ్లినప్పుడు ఫోటో తీసి అప్ లోడ్ చేయాలన్నారు. స్పందనలో వచ్చిన ఏ ఒక్క అర్జీ “ రీ ఓపెన్” కు తావులేకుండా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు.
స్పందనలో వచ్చిన కొన్ని అర్జీలు . –
* నిమ్మలకుంట గ్రామానికి చెందిన తోలుబొమ్మలాట కళాకారులు కుల్లాయప్ప, హనుమంతు, గంగాధర శ్రీనివాసులు, శాంతమ్మ, శ్వేత మమత తదితరులు 2018 సంవత్సరంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోతుల నాగేపల్లి బ్రాంచ్ నందు తోలుబొమ్మల తయారీ కొరకు ఒక్కొక్కరు రూ.8 లక్షలు పిఎంఈజీపి రుణం 35 శాతం సబ్సిడీ రూపంలో లబ్ధి పొందామని అయితే బ్యాంకు అధికారులు సబ్సిడీపై వడ్డీ వసూలు చేశారు. ఈ విషయమై తగు న్యాయం చేయవలసిందిగా అర్జీని సమర్పించారు.
*. బుక్కపట్నం నర్సింగ్ పల్లి తండా లో గ్రామ సచివాలయాన్ని నూతనంగా ఏర్పాటు చేయాలని వీడియో కోరుతూ పలువురు గ్రామస్తులు కలెక్టర్ ని కలిసి అర్జీని సమర్పించారు.
* కనగానపల్లి మండలం వేపకుంటలో తన భూమిలో కాలువ తవ్వకం 2017 సంవత్సరంలో జరిగిందని ఇప్పటివరకు ప్రభుత్వం ద్వారా ఎలాంటి నష్టపరిహారం అందలేదని కోరుతూ ఆంజనేయులు అర్జీలు సమర్పించారు
ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఎ పి డి నరసయ్య,Dwma PD, రామాంజనేయులు, DMHO తిపేంద్రేనాయక్, డి ఈ ఓ మీనాక్షి, RWS రషీద్, ఎస్ .E. పి ఆర్, గోపాల్ రెడ్డి, స్పందన తాసిల్దార్ గోపాలకృష్ణ, సి పి ఓ విజయ్ కుమార్, డి పి ఓ విజయ్ కుమార్,సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు,
addComments
Post a Comment