మళ్లీ వస్తా.. ఇలాగే ఉంటే మీ ఇష్టం..!

 *మళ్లీ వస్తా.. ఇలాగే ఉంటే మీ ఇష్టం..!*


– సచివాలయ సిబ్బంది పనితీరుపై ఎమ్మెల్యే అనంత అసంతృప్తి

– కాలువల్లో పూడికతీత పనులు సరిగా చేయించలేదని ఆగ్రహం

– డ్రెయినేజీలపై నిర్మాణాలు చేపడితే ఎలాగని స్థానికులకు ప్రశ్న

– సచివాలయం పరిధిలో ప్రతి ఇల్లూ మ్యాపింగ్‌ కావాల్సిందే

– 31వ డివిజన్‌లో కొనసాగిన గడప గడపకు మన ప్రభుత్వం 



అనంతపురం, సెప్టెంబర్‌ 24 (ప్రజా అమరావతి): 


‘‘డ్రెయినేజీలు సరిగా తీయించడం లేదు. మురుగునీరు ముందుకు కదలడం లేదు. మీరంతా ఏం చేస్తున్నారు. మనం సంక్షేమ పథకాలు అందించినా, అందించకపోయినా ప్రతి ఇంటిని మ్యాపింగ్‌ చేయాలని చెబుతూనే ఉన్నా. కానీ మీకు పట్టడం లేదు. ఈ సచివాలయం పరిధిలో మళ్లీ పర్యటిస్తా. పరిస్థితిలో మార్పు రాకుంటే చర్యలు తప్పవు’’ అని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అరవింగనగర్‌–2 సచివాలయ సిబ్బందితో అన్నారు. శనివారం నగరంలోని 31వ డివిజన్‌లో కార్పొరేటర్‌ చవ్వా రాజశేఖరరెడ్డితో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు స్థానికంగా ఉన్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. డ్రెయినేజీ కాలువలపై నిర్మాణాలు చేపట్టడాన్ని గుర్తించి ఎలా పడితే అలా నిర్మిచకుడదు.

Comments