బదిలీ అయిన పంచాయతీ కార్యదర్శులు వారు గతంలో నిర్వహించిన పోస్టు యొక్క రికార్డులు తక్షణం అప్పగించాలిరాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 


బదిలీ అయిన పంచాయతీ కార్యదర్శులు వారు గతంలో నిర్వహించిన పోస్టు యొక్క రికార్డులు తక్షణం అప్పగించాల


ని జిల్లా పంచాయతీ అధికారి పి. జగదాంబ సోమవారం ఒక ప్రకటనలో ఆదేశించారు.
బదిలీ అయిన కొందరు కార్యదర్శులు తమ తదుపరి ఆయా పంచాయతీల్లో నియమించిన వారికి ఉద్దేశ పూర్వకంగానే బాధ్యతలు అప్పగించలేదని జిల్లా యంత్రాంగం దృష్టికి వచ్చిందని అన్నారు.  పంచాయతీ కార్యదర్శులు బదిలీలు జూన్-2022 నెలలోనే పూర్తయినందున, మీ మండలంలో అలాంటి పెండింగ్‌లు లేవని నిర్ధారించుకోవడానికి అన్ని  ఈ ఓ పిఆర్డిలు  లు తమ మండలాలు పరిధిలో బదిలీ అయిన ప్రతి ఒక్కరూ తమ తదుపరి వారికి చార్జి అప్పగించిన వివరాల నివేదిక ఇవ్వాలని డిపివో జగదాంబ ఆదేశించారు. . రేపు మధ్యాహ్నం 3 గంటలలోగా, అన్ని EO (PR&RD)లు దీనికి సంబంధించి ఎటువంటి ఛార్జీలు పెండింగ్‌లో లేవని నిర్ధారిస్తూ  ఉన్న సర్టిఫికేట్‌ను పంపాలన్నారు. మీ మండలంలో అలాంటి కేసు ఏదైనా పెండింగ్‌లో ఉంటే అది సీరియస్‌గా పరిగణించడం తో పాటు అటువంటి వారిపై శాఖ పరమైన కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. డివిజనల్ పంచాయతీ అధికారులు వ్యక్తి గతంగా పర్యవేక్షన చేయాలన్నారు.Comments
Popular posts
అర్హులైన వారందరికీ వర్తించేలా వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరవ రోజున శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మి గా దర్శనమిస్తారు.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏడవ రోజున శ్రీ కనక దుర్గమ్మ వారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు.
Image
అక్టోబరు 25న ఇ–క్రాపింగ్‌ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శన, షెడ్యూల్‌ వివరించిన సీఎం.
Image
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి.
Image