నెల్లూరు, సెప్టెంబరు 27 (ప్రజా అమరావతి); ఆజాదీసే అంత్యోదయ తక్ కార్యక్రమంలో దేశంలోనే ఆరో స్థానం దక్కినందుకు జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబును జెడ్పి సీఈవో శ్రీమతి వాణి, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీ శ్రీకాంత్ ప్రదీప్ కుమార్ నాబార్డ్ డీడీఎం శ్రీ రవి సింగ్ ఘనంగా సత్కరించారు.
సోమవారం న్యూఢిల్లీలో జిల్లా కలెక్టర్ తరపున జాతీయ పురస్కారం అందుకున్న జెడ్పి సీఈవో,
ఎల్డీఎం మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ను వారి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా న్యూఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి నుండి వారు అందుకున్న ప్రశంసా పత్రాలను, జ్ఞాపికలను వారు జిల్లా కలెక్టర్ కు చూపించి వారి నుండి స్వీకరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ప్రోత్సాహంతో జిల్లా యంత్రాంగమంతా కలిసికట్టుగా ఆజాదీకా అమృత్ మహోత్సవ కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించగలిగామని, జాతీయ పురస్కారం సాధనలో జిల్లా కలెక్టర్ పక్కా ప్రణాళికతో దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు.
addComments
Post a Comment