రైతులు - అధికారుల మధ్య అనుసంధానం ఉండాలి

 రైతుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి*


*: రైతులు - అధికారుల మధ్య అనుసంధానం ఉండాలి


*


*: మూడేళ్లలో రైతుల సంక్షేమం కోసం రూ.83 వేల కోట్ల ఖర్చు చేసిన సీఎం జగన్*


*: రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవిఎస్.నాగిరెడ్డి*


*సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక పూర్తి నిబద్ధతతో రైతులకు సాయం : ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), సెప్టెంబర్ 07 (ప్రజా అమరావతి):


*వ్యవసాయ మిషన్ ద్వారా రైతుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవిఎస్.నాగిరెడ్డి పేర్కొన్నారు. రైతులు ఏ సమస్య ఉన్న వ్యవసాయ మిషన్ కు తెలియజేయాలన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉన్న సమస్యలపై రిపోర్టులు అందిస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.*


*బుధవారం పుట్టపర్తి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వ్యవసాయ మరియు అనుబంధ రంగాల భాగస్వామ్య పక్షాల ముఖాముఖి చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవిఎస్.నాగిరెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, జిల్లా అగ్రి అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ రమణారెడ్డి, ఉమ్మడి జిల్లాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఆర్డీటీ ఎకాలజీ డైరెక్టర్ మల్లారెడ్డి,  పూడా చైర్మన్ లక్ష్మీనరసమ్మ, జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావు, అగ్రి బోర్డ్ మిషన్ మెంబర్ రాజారాం, తదితరులు హాజరయ్యారు.*


*ఈ సందర్భంగా రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో ఈరోజు 12వ వ్యవసాయ, అనుబంధ రంగాల భాగస్వామ్య పక్షాల ముఖాముఖి చర్చా కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. రైతులకు - రాష్ట్ర ముఖ్యమంత్రికి, జిల్లా స్థాయి అధికారులకు, శాస్త్రవేత్తలకు- ముఖ్యమంత్రికి తాము అనుసంధానంగా ఉండడం తమ బాధ్యత అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే పగటిపుటి 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మూడేళ్లలో రైతుల సంక్షేమం కోసం 83 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగిందన్నారు. డా.వైఎస్సార్ రైతు భరోసా - పిఎం కిసాన్, ఉచిత బీమా, ఏ సీజన్లో పంట నష్టపోతే ఆ సీజన్లోనే నష్టపరిహారం అందించడం, గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతోందన్నారు. సీఎం జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఏ ఒక్క కార్యక్రమాన్ని, పథకాలను ఆపకుండా అమలు చేయడం జరుగుతోందని, పార్టీలకతీతంగా పథకాలను అందిస్తున్నామన్నారు. రైతుగా అనుభవం ఉన్న వారికే అగ్రి అడ్వైజరి బోర్డ్ చైర్మన్ లుగా అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. జగనన్న ప్రభుత్వం వ్యవసాయానికి, విద్య, వైద్య, మార్కెటింగ్ రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. దివంగత మహానేత వైయస్సార్ ఒక్క అడుగు ముందుకు వేస్తే ఆయన తనయుడైన సీఎం జగన్ వేయి అడుగులు ముందుకు వేస్తూ రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారన్నారు.*


*రైతులు - అధికారుల మధ్య అనుసంధానం ఉండాలని, వారి మధ్య సంబంధం ఎంతో ముఖ్యమని, వారు ఒక కుటుంబ సభ్యులు లాగా ఉంటే ఏదైనా సాధించేందుకు వీలవుతుందన్నారు. వ్యవసాయ పరిశోధనాలయాలు రైతుల పాలిట దేవాలయాలని, శాస్త్రవేత్తలు రైతు సోదరులకు అనుకూలంగా పనిచేయాలన్నారు. పరిశోధన అనేది నిరంతర ప్రక్రియ అని దానిని కొనసాగించాలన్నారు. అధికారులు రైతులకు ఏం కావాలి అనేది తెలుసుకొని దానికి అనుగుణంగా పనిచేయాలని, వారి సమస్యలకు పరిష్కార మార్గం చూపాలన్నారు. జిల్లాలో వేరుశనగ సాగు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పాడి పరిశ్రమ, హార్టికల్చర్ సాగుపై దృష్టి పెట్టడం కూడా ముఖ్యమన్నారు .రైతుల పండించిన పంటలకు మార్కెటింగ్ ప్రధాన సమస్యగా ఉందని, పంటలకు లాభసాటి ధర వచ్చేలా చూడాలన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులు అవసరమైన జ్ఞానాన్ని పెంచుకొని ఆవేశపడకుండా సమస్యలకు పరిష్కారం కనుగొనాలన్నారు. గ్రామ, మండల స్థాయిలో ఏర్పాటుచేసిన అగ్రి అడ్వైజరీ బోర్డ్ చైర్మన్లు ప్రభుత్వ పాలసీలు తెలుసుకోవాలని, దీని ద్వారా వారికి అవగాహన కలుగుతుందన్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల గురించి పక్క రాష్ట్రాల వారు కూడా మాట్లాడడం జరుగుతోందని, ఇతర రాష్ట్రాల వారు ఇక్కడికి వచ్చి ఆర్బికెలను పరిశీలిస్తున్నారన్నారు. రైతు భరోసా కేంద్రాలను మరింత బాగా నిర్వహించాలని, వాటి పరిధిలో రైతులకు మేలు చేసే పొలంబడి కార్యక్రమాలు కొనసాగించాలన్నారు. రైతులు ఈ క్రాప్ రిజిస్ట్రేషన్, ఈ కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం వద్దని, దీని ద్వారా రైతులకు పలు విధాలా లబ్ధి కలుగుతుందన్నారు. వ్యవసాయంలో అనుభవిజ్ఞులైన రైతులు ఇతర రైతులకు సలహాలు, సూచనలు అందించాలన్నారు. రైతులకు మేలు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టబడి ఉందన్నారు.*


*సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక పూర్తి నిబద్ధతతో రైతులకు సాయం : ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి*


*ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి నిబద్ధతతో రైతులకు సాయం చేస్తున్నారన్నారు. రైతు భరోసా కింద  రూ. 13,500 పెట్టుబడి సాయం, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందిస్తున్నారని, ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వ్యవసాయ మరియు అనుబంధ రంగాల భాగస్వామ్య పక్షాల ముఖాముఖి చర్చా కార్యక్రమాన్ని నిర్వహించి రైతులను చైతన్య పరచాలన్నారు. రైతు పొలంలోకి వెళ్లేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆలోచించాలన్నారు. జిల్లాల రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, మండలాల్లో ప్రాసెసింగ్ పట్ల రైతులకు సరైన సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. పట్టు పరిశ్రమను అభివృద్ధి చేసుకుంటే రైతు జేబులో నిత్యం డబ్బులు ఉంటాయని, పట్టు పరిశ్రమను ఎలా పెంచాలి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వైయస్సార్ జలకళ కింద జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి అదనంగా వెయ్యి బోర్లు వేసేలా పంచాయతీరాజ్ కమిషనర్ కి, ప్రిన్సిపల్ సెక్రెటరీ కి లేఖ రాయాలన్నారు. ఎక్కువ మొత్తంలో పంటలు సాగేలా వ్యవసాయ అధికారులు, ఏడీలు, గ్రామ, మండల, అగ్రి అడ్వైజరీ బోర్డ్ చైర్మన్లు బాధ్యతలు తీసుకోవాలని, పంటల సాగుకు రైతులు ముందుకు వచ్చేలా వారికి అవగాహన కల్పించేందుకు గ్రామ సభలు నిర్వహించాలన్నారు. ఇంతకుముందు రైతును రాజుగా చేయాలని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆలోచించారని, ఆయన అడుగుజాడల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతుల పక్షపాతిగా నిలుస్తున్నారన్నారు. రైతులకు నూతన వేరుశనగ విత్తన వంగడాలను ఉచితంగా అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టు పరిశ్రమ రైతుల సమస్యలపై ఒక నోట్ తయారు చేసి అందించాలని, వారి సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు.*


*ఈ కార్యక్రమంలో కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త సంపత్ కుమార్, పశు సంవర్ధక శాఖ సుబ్రహ్మణ్యం, పట్టు పరిశ్రమ శాఖ జెడి పద్మమ్మ, జిల్లా ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్, ఏపీఎంఐపీ పిడి సుదర్శన్, జిల్లా ఎపి మార్క్ఫెడ్ మేనేజర్, ఎపి సీడ్స్ మేనేజర్, ఇతర అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.Comments
Popular posts
అర్హులైన వారందరికీ వర్తించేలా వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరవ రోజున శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మి గా దర్శనమిస్తారు.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏడవ రోజున శ్రీ కనక దుర్గమ్మ వారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు.
Image
అక్టోబరు 25న ఇ–క్రాపింగ్‌ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శన, షెడ్యూల్‌ వివరించిన సీఎం.
Image
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి.
Image