రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ నాయకులతో 'వాసిరెడ్డి పద్మ'

 పోక్సో అడిషనల్ కోర్టు ఏర్పాటుకు కృషి

- రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ నాయకులతో 'వాసిరెడ్డి పద్మ'


రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి):

పోక్సో అడిషనల్ కోర్టును రాజమహేంద్రవరంలో ఏర్పాటుకు కృషి చేస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ హామీనిచ్చారు. గురువారం రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ కు విచ్చేసిన వాసిరెడ్డి పద్మ

పలువురు సీనియర్ న్యాయవాదులు, అసోసియేషన్ నాయకులను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ లీగల్ సెల్ నాయకులు, న్యాయవాదులు ఆమెకు ఫోక్సో అడిషనల్ కోర్టును రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. కాకినాడ పోక్సో కోర్టులో ప్రస్తుతం సుమారు 750కి పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయని, రాజమహేంద్రవరం, రంపచోడవరం తదితర ప్రాంతాల నుండి పోక్సో కేసుల విచారణలో జాప్యం తదితర ఇబ్బందులున్నాయని వారు చెప్పారు. దీనిపై వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ మహిళలు, బాలికల కేసుల్లో  సత్వర న్యాయానికి కోర్టుల సంఖ్య పెరగాల్సిన అవసరముందని... ఆ దిశగా మహిళా కమిషన్ కృషిచేస్తామని ఆమె హామీనిచ్చారు. పోక్సో అడిషనల్ కోర్టు ఏర్పాటుకు కృషి

- రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ నాయకులతో 'వాసిరెడ్డి పద్మ'

-------------------

రాజమహేంద్రవరం:

పోక్సో అడిషనల్ కోర్టును రాజమహేంద్రవరంలో ఏర్పాటుకు కృషి చేస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ హామీనిచ్చారు. గురువారం రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ కు విచ్చేసిన వాసిరెడ్డి పద్మ

పలువురు సీనియర్ న్యాయవాదులు, అసోసియేషన్ నాయకులను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ లీగల్ సెల్ నాయకులు, న్యాయవాదులు ఆమెకు ఫోక్సో అడిషనల్ కోర్టును రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. కాకినాడ పోక్సో కోర్టులో ప్రస్తుతం సుమారు 750కి పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయని, రాజమహేంద్రవరం, రంపచోడవరం తదితర ప్రాంతాల నుండి పోక్సో కేసుల విచారణలో జాప్యం తదితర ఇబ్బందులున్నాయని వారు చెప్పారు. దీనిపై వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ మహిళలు, బాలికల కేసుల్లో  సత్వర న్యాయానికి కోర్టుల సంఖ్య పెరగాల్సిన అవసరముందని... ఆ దిశగా మహిళా కమిషన్ కృషిచేస్తామని ఆమె హామీనిచ్చారు. 

అక్టోబర్ ఒకటో తేదీన మహిళా కమిషన్ ఆధ్వర్యంలో రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో నిర్వహించే 'దసరా మహిళా సాధికారత ఉత్సవం' లో అందరూ పాల్గొనాలని వాసిరెడ్డి పద్మ కోరారు.

ఈ కార్యక్రమంలో బార్ అసోషియేషన్ అధ్యక్షులు ఇల్లా శివప్రసాద్, కార్యదర్శి నాగరాజు, సీనియర్‌ న్యాయవాదులు ముప్పాళ్ళ సుబ్బారావు, హసీనా, శ్యామల తదితరులు పాల్గొన్నారు.

Comments