*అనంతపురం జిల్లా రాప్తాడులో ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవిందరెడ్డి పర్యటన*
*బెస్ట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వస్త్ర పరిశ్రమకోసం భూముల పరిశీలన*
*స్థానిక ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటుకు 'బెస్ట్'ఆసక్తి*
*ఎమ్మెల్యేతో కలిసి ఏపీఐఐసీ భూములను 'బీసీపీఎల్' ఎండీ రాజ్ కుమార్ కు చూపిన ఛైర్మన్*
అమరావతి, సెప్టెంబర్, 23 (ప్రజా అమరావతి): అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి పర్యటించారు. బెస్ట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీపీసీఎల్) వస్త్ర పరిశ్రమ ఏర్పాటుకు అనువైన భూములను స్థానిక ఎమ్మెల్యే తోపుదుర్తితో కలిసి ఛైర్మన్ పరిశీలించారు. తమిళనాడులోని తిరుపూర్ కి చెందిన బెస్ట్ వస్త్ర పరిశ్రమ అత్యాధునిక యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానంతో 125 మిలియన్ల యూఎస్ డాలర్ల టర్నోవర్ కలిగి ఉందని స్థానిక ఎమ్మెల్యే తోపుదుర్తి పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా చిన్నపిల్లల వస్త్రాల తయారీలో ప్రసిద్ధి చెందినట్లు వివరించారు. ఇప్పటికే రాప్తాడులో తమ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నదని ఛైర్మన్ వెల్లడించారు. 10 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలనుకుంటున్న బీపీసీఎల్ ద్వారా సుమారు 4వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. బెస్ట్ సంస్థ రూ.100కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకోసం స్థానిక ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డితో కలిసి రాప్తాడులోని 26 ఎకరాల ఏపీఐఐసీకి చెందిన భూములను పరిశీలించినట్లు ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి స్పష్టం చేశారు. తమిళనాడు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో వచ్చి బెస్ట్ కార్పొరేషన్ ఎండీ ఆర్.రాజ్ కుమార్ సహా ఇతర ప్రతినిధులు రాప్తాడు వచ్చి భూములను పరిశీలించినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మురళీమోహన్, బీపీసీఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు.
addComments
Post a Comment