భవనాల నిర్మాణం పూర్తి చేయడంలో సమగ్ర సూక్ష్మ స్థాయి కార్యాచరణ ప్రణాళిక అవసరం



రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 



ఏరియా, ప్రాథమిక ఆసుపత్రులలో  సి ఎస్ ఆర్ ద్వారా అందచేసిన పరికరాలు , సామాగ్రి వినియోగం లోనూ, ప్రాధాన్యత భవనాల నిర్మాణం పూర్తి చేయడంలో సమగ్ర  సూక్ష్మ స్థాయి కార్యాచరణ ప్రణాళిక అవసరం


అని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.


బుధవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో  ఆసుపత్రులు, ప్రాధాన్యత భవనాలపై సంబంధించిన శాఖల  క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బంది, సచివాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ,  జిల్లాలో వివిధ ప్రభుత్వ పీహెచ్ సి, సి హెచ్ సి తదితర ఆరోగ్య కేంద్రాలలో కార్పొరేట్ సర్వీస్ రెస్పాన్సిబిలిటీ కింద పంపిణీ చేసిన పరికరాలు, ఉపకరణాలు పూర్తి స్థాయి లో వినియోగం లోకి తీసుకుని వొచ్చే బాధ్యత సంబందించిన ఆసుపత్రుల ఇంఛార్జి లదే అన్నారు. కొవ్వూరు సి హెచ్ సి ఆకస్మిక తనిఖీ సమయంలో కొన్ని పరికరములు వినియోగం లేకపోవడం తమ దృష్టికి వచ్చిందన్నారు.  ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య సేవలు కోసం వొచ్చే నిరుపేదలకు మనస్సుతో స్పందించి వైద్య సేవలు అందించే సామర్థ్యం పెంచుకోవాలన్నారు.



ప్రాధాన్యత భవనాల నిర్మాణం పై మైక్రో ప్లానింగ్ అవసరం:


జిల్లా కలెక్టర్ మాధవీలత మూడు ప్రాధాన్యత భవన నిర్మాణాలు నవంబర్ నాటికి పూర్తి చేయాలంటే అందుకు సూక్ష్మ స్థాయి ప్రణాళిక అవసరం అని కలెక్టర్ మాధవీలత అన్నారు.  ప్రస్తుతం గ్రామ సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ గా యువ ఇంజనీర్లు పనిచేస్తున్నారని, వారు ఒక నిర్దుష్ట ప్రణాళిక సిద్ధం చేసుకోవా లన్నారు. పరీక్షలకు సిద్ధం ఏ విధంగా అయితే ఫలితాలు సాధించడం సాధ్యం అవుతుందనే దిశగా ఆలోచన చేసి, వాటిని ఆచరణలో చూపితే లక్ష్యాలను సాధించడం దిశగా అడుగులు వేయాలని సూచించారు. అరవై శాతం భవనాలు పూర్తి చేశామని, మిగిలిన వాటిలో 50 శాతం నిర్మాణ చివరి దశలో ఉన్నాయన్నారు. జిల్లాలో 1101 భవనాల్లో 680 పూర్తి అవ్వగా. మిగిలిన వాటిలో సుమారు 421 వాటిల్లో 200 పై చిలుకు భవనాలు 50 శాతం పైగా పూర్తి అయ్యాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్క ప్రాధాన్యత భవనం నవంబర్ నాటికి చివరిదశలోకి తీసుకుని రావాల్సి ఉంటుందన్నారు. స్టేజ్ కన్వర్షన్ ద్వారా మీ సచివాలయ పరిధిలోని లక్ష్యాలను సాధించగలం అన్నారు. 


 ఈ సమావేశంలో ఎస్ ఈ పి ఆర్ వి బి వి ప్రసాద్, డ్వామా పీడీ జీ. రామ్ గోపాల్, డి ఎ హెచ్ ఓ  డా. ఎస్ జీ టి సత్యగోవింద్, డా ఎమ్. సనత్ కుమారి, డి ఎమ్ హెచ్ వో డా ఎన్. వసుంధర తదితరులు పాల్గొన్నారు.





Comments