నెల్లూరు (ప్రజా అమరావతి);
అర్హత ఉన్న పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఎవ్వరు కూడా సంక్షేమ పథకాలు కోల్పోకూడద
నే ఉద్దేశంతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుచున్నదని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రొసెసింగ్ శాఖామాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
సోమవారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని, మనుబోలు మండలం గోవిందరాజుపురంలో చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డికి పెద్ద ఎత్తున మహిళలు, అభిమానులు, ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. మంత్రి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు గురించి వివరిస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ, వారు పొందుతున్న లబ్ధి సమాచారంతో కూడిన బుక్ లెట్‌ను అందజేశారు.
ఈ సంధర్బంగా మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన తరువాత పేదల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేయడం జరుగుచున్నదన్నారు. ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సాంకేతిక కారణాలతో అర్హత ఉండి కూడా సంక్షేమ పథకాలు అందని పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల ప్రయోజనాన్ని అందించడమే ఈ కార్యక్రమంలో ప్రధాన ఉద్దేశం అన్నారు. నేడు పేద ప్రజల అభ్యున్నతికి వైఎస్ఆర్ చేయూత, నేతన్న నేస్తం, కాపునేస్తం, అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, రైతు భరోసా వంటి ఎన్నో కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేస్తూ ఏ రాష్ట్రంలో లేని విధంగా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని మంత్రి తెలిపారు. గ్రామంలో ప్రజలు కోరిన అభివృద్ధి పనులు చేపట్టుటకు ప్రతి సచివాలయంనకు 20 లక్షల రూపాయల రూపాయలు కేటాయిండం జరిగిందని మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని ఆన్నీ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, సైడు మురుగు కాలువల నిర్మాణాలు, త్రాగునీరు , విద్యుత్ తదితర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
మంత్రి వెంట తహశీల్దార్ శ్రీ సుధీర్, ఎంపిడిఓ శ్రీ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల మండల అధికారులు, ప్రజా ప్రతినిధిలు, వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment