ఎయిడ్స్ ఫ్రీ రాష్ట్రంగా ఏపీ



*ఎయిడ్స్ ఫ్రీ రాష్ట్రంగా ఏపీ*

*అవగాహనా, చైతన్య కార్యక్రమాల్లో ఏపీశాక్స్ ముందుంది*


*రాష్ట్ర వైద్య ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజిని*


*కేఎల్ వర్సిటీలో సేఫ్ లైఫ్, రెడ్ రిబ్బన్ క్లబ్స్ ప్రారంభం*


అమరావతి (ప్రజా అమరావతి):

దేశంలో ' ఏపీ ఎయిడ్స్ ఫ్రీ ' రాష్ట్రంగా నిలుస్తుందని, రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అవగాహనా, చైతన్య కార్యక్రమాలలో ప్రథమ స్థానంలో నిలుస్తోందని

 రాష్ట్ర వైద్యారోగ్య,  కుటుంబ సంక్షేమ, వైద్య విద్యా శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. ప్రస్తుత జీవన విధానంలో  మనిషికి ఆరోగ్యానికి మించినది మరొకటి లేదని, ఆరోగ్యమే మహాభాగ్యమని ఆమె అన్నారు.

రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ వారు వర్సిటీలో నూతనంగా ఏర్పాటుచేసిన సేఫ్ లైఫ్ క్లబ్, రెడ్ రిబ్బన్ క్లబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ . కరోనా వలన మనం మన జీవితంలో చాలా నేర్చుకున్నామని, ముందు జాగ్రత్త చర్యలు ఎంతో అవసరమని, యోగ, పౌష్టిక ఆహారం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని చెప్పారు. సేఫ్ లైఫ్ ప్రచారంలో ప్రతి విద్యార్థి పాత్ర ఎంతో ముఖ్యమని, దీనికి ఉదాహరణగా నా విద్యార్థి జీవితం ఆధారంగా మీకు తెలుపుతున్నానని అన్నారు. అనంతరం క్లబ్స్ వెబ్ సైట్, గోడ పత్రిక, ఫెలోషిప్, బ్యాడ్జిలను ఆమె ఆవిష్కరించారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి, రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జిఎస్. నవీన్ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రచారం కేవలం అందరిలో చిన్న ఆలోచన మాత్రమే కాదు అని, ఒక సమస్య అని, మా జట్టుతో ఒక నూతన ప్రారంభం తీసుకొని, నూతన జీవితాన్ని తీసుకురావాలని మా ప్రయత్నం అన్నారు. సమాజంలో శ్రమతో కూడిన మార్పు కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. దేశ భవిష్యత్తు మార్పు కోసం ప్రతి ఒక్కరూ ఈ ప్రచారంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. యూనిసెఫ్ ముఖ్య క్షేత్ర పర్యవేక్షణాధికారి ఎం. రసిడియా మాట్లాడుతూ యూనిసెఫ్ ప్రజల ఆరోగ్యంపై ప్రచారం చేస్తుందని, తల్లుల నుండి పిల్లలకు ఎయిడ్స్ వ్యాపించకుండా ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని అయినా కూడా దానికోసం మనమందరం ఒక్కటిగా కష్టపడాలని, ముఖ్యంగా టీబీ రోగులకు ఎయిడ్స్ సోకకుండా కష్టపడుతున్నమన్నారు. సోషల్ మీడియా ద్వారా ఈ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రజల ఆరోగ్యంతో పాటు బాల్యవివాహాలు, చిన్న వయసులో గర్భం దాల్చడం వంటి వాటిపై కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఆరోగ్యంతో పాటు చదువు, పౌష్టికాహారం, సురక్షితమైన లైంగిక చర్య అవసరం అని గుర్తు చేశారు. సేఫ్ లైఫ్ పై ప్రచారం చేయాలని, మార్పు కష్టం కావచ్చు కానీ అసాధ్యం మాత్రం కాదని, కొత్త ఆవిష్కరణలు, ఆలోచనలు చాలెంజ్ గా తీసుకొని ముందంజ వేయాలని  కోరారు. కేఎల్ వర్సిటీ వైస్ ఛాన్స్ లర్ డాక్టర్ జి. పార్థసారధి వర్మ మాట్లాడుతూ వర్సిటీలో స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ ఆధ్వర్యంలో సేఫ్ లైఫ్ క్లబ్ ప్రారంభించటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ డైరెక్టర్ పి. సాయి విజయ్ కు మంత్రి చేతుల మీదగా రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఎక్స్ లెంట్ అవార్డును, వర్సిటీకి ప్రత్యేక జ్ఞాపికను ప్రధానం చేశారు. అనంతరం వీడియో పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. తదనంతరం అతిథులను దుశ్శాలువ, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.

Comments