ఇంటి గ్రేటెడ్ విద్య, నైపుణ్యాభివృద్ది కార్యక్రమాలురాజమహేంద్రవరం (ప్రజా అమరావతి); ఇంటి గ్రేటెడ్ విద్య, నైపుణ్యాభివృద్ది కార్యక్రమాలు


దిశగా జిల్లాలో 7985 మంది విద్యార్ధులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా వివిధ కంపెనీల్లో 6972 మందికి ఉపాధి కల్పించామని  జిల్లా కలెక్టర్ డా. కె . మాధవీలత పేర్కొన్నారు.


 బుధవారం సాయంత్రం  స్థానిక కలెక్టరు సమావేశ మందిరంలో ఇంటి గ్రేటెడ్ విద్య, నైపుణ్యాభివృద్ది కార్యక్రమాల పై సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధి కల్పనే ధ్యేయంగా మిగిలిన విద్యార్థులకు శిక్షణ అందించేందుకు శుక్రవారం నాటికి నిర్దుష్టమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ విద్యా సంవత్సరంలో కంప్యూర్ విభాగంలో 4,150 వేల మందికి జంతుశాస్త్రం అనుబంధ విభాగంలో 1850 మందికి ఇతర పరిశ్రమల్లో 952 మందికి, మార్కెటింగ్ రంగంలో 170 మందికి ఉద్యోగావకాశాలను కల్పిస్తూ ముందస్తు నియామక పత్రాలు అందజేయడం జరిగిందన్నారు.  ఆయా కంపెనీలకు అవసరమైన నైపుణ్యాన్ని పెంచేందుకు శిక్షణా కార్యక్రమాలను అందించే  క్రమంలో అప్రంటీస్ కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుందన్నారు. భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ పాలసీ ప్రకారం 75 శాతం మంది స్థానికులకే ఉద్యోగాల్లో ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉందని కలెక్టరు ఈ సందర్బంగా తెలిపారు. 


ఈ సమావేశంలో  జిల్లా పరిశ్రమల అధికారి బి. వెంకటేశ్వరరావు, రిజిష్టర్ ఆఫ్ యూనివర్సి ప్రతినిధి ఆర్ సురేష్ వర్మ, వికాస్ అధికారి లచ్చా రావు ఇతర అధికారులు పాల్గొన్నారు.


Comments