ఈ నెల 22 న కుప్పం లో వై.ఎస్. ఆర్ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నగౌ.రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి.
గౌ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర ఎక్సైజ్ శాఖామాత్యులు.
గౌ.రాష్ట్ర ముఖ్య మంత్రి కుప్పం పర్యటనను విజయవంతం చేయండి:*
*గౌ.రాష్ట్ర అటవీ, ఇందన, విద్యుత్ మరియు శాస్త్ర సాంకేతిక శాఖామాత్యులు*
*గౌ.రాష్ట్ర ముఖ్య మంత్రి పర్యటన లో అధికారులు సమ న్వయం తో పనిచేసి విజయ వంతం చేద్దాం:*
*జిల్లా కలెక్టర్*
కుప్పం,సెప్టెంబర్ 12 (ప్రజా అమరావతి):
గౌ. రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు ఈ నెల 22న 3 వ విడత వై. ఎస్.ఆర్ చేయూత కార్యక్రమంను కుప్పం నుండి ప్రారంభించనున్నారని ఈ కార్యక్రమానికి సంపూర్ణ సహకారా న్ని అoదించి విజయ వంతం చేయాలని గౌ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర ఎక్సైజ్ శాఖామాత్యులు శ్రీ కె. నారాయణ స్వామి తెలిపారు.
గౌ.రాష్ట్ర ముఖ్య మంత్రి పర్యటనలో ఏర్పాట్లలో భాగంగా సోమవారం కుప్పం లోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో గౌ.రాష్ట్ర అటవీ, ఇందన, విద్యుత్ మరియు శాస్త్ర సాం కేతిక శాఖా మాత్యు లు శ్రీ పెద్ది రెడ్డి రామ చంద్రా రెడ్డి,చిత్తూరు పార్లమెంటు సభ్యు లు ఎన్.రెడ్డప్ప,గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనల సలహా దారు తలశీల రఘు రాం,గౌ.జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివా సులు,జిల్లా కలెక్టర్ యం.హరినారా యణన్, జిల్లా ఎస్పి రిశాంత్ రెడ్డిలతో కలసి సమీక్షా సమా వేశం ఏర్పాటు చేశారు...
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ నవరత్నాల పథకాల అమలులో భాగంగా 3 వ విడత వై.ఎస్. ఆర్ చేయూత కార్య క్రమాన్ని గౌ.రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు కుప్పం నుండి ప్రారం భించనున్నారని తెలిపారు. 45 నుండి 60 సం. ల మధ్య వయసు గల ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనారిటీ వర్గాల మహిళలకు వై.ఎస్.ఆర్ చేయూత క్రింద రూ.18,750/- లు అందించనున్నారని తెలిపారు. నవరత్నాల అమలు తో పేదల ఇంట్లో వెలుగు నింపిన ముఖ్యమంత్రి గారు కుప్పం విచ్చేయు చున్న సందర్భంగా ఉన్నతాధికారులు మరియు జిల్లా అధికారులు, సిబ్బంది సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
గౌ. రాష్ట్ర అటవీ, ఇందన, విద్యుత్ మరియు శాస్త్ర సాం కేతిక శాఖా మాత్యు లు శ్రీ డాక్టర్ పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి మాట్లాడుతూ 3 వ విడత వై.ఎస్.ఆర్ చేయూత కార్య క్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు కుప్పం నుండి ప్రారంభించనున్నారని, ఈ కార్యక్రమo లో ఎటువంటి చిన్న పాటి లోటుపాట్లకు తావు లేకుండా నిర్వ హించాలని అధికా రులకు సూచించా రు.ఈ కార్యక్రమానికి సంబంధించి జిల్లా కలెక్టర్ వారు సంబం ధిత శాఖ అధికారు లకు మరియు సిబ్బందికి విధులను కేటాయించడం జరు గుతుందని, జిల్లా యంత్రాంగానికి మంచి పేరు వచ్చేలా తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించి ఈ పర్యటన ను విజయ వంతం చేయాలన న్నారు.
జిల్లా కలెక్టర్ మాట్లా డుతూ ఈనెల 22న గౌ. రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారి కుప్పం పర్యటనను అధికారులందరూ సమన్వయంతో పని చేసి విజయ వంతం చేద్దామని అధికారు లకు కేటాయించిన విధులను బాధ్యత తో నిర్వహించి ఎటు వంటి పొరపాట్లకు తావు లేకుండా పని చేయాలన్నారు.
ఈ సమీక్షా సమా వేశంలో గౌ.చిత్తూరు, పలమనేరు, పూతల పట్టు ఎం ఎల్ ఏ లు ఆరణి శ్రీనివాసులు, వెంకటేగౌడ్, ఎం ఎస్ బాబు,గౌ.ఎం ఎల్ సి భరత్, టిటిడి బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్, పి కె ఎం చైర్మన్ వెంకట్ రెడ్డి యాదవ్, రాష్ట్ర జానపద కళల అభివృద్ధి సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం, ఏ పి ఎస్ ఆర్ టి సి రాష్ట్ర వైస్ చైర్మన్ విజయా నంద రెడ్డి, డి ఆర్ ఓ ఎన్. రాజశేఖర్,డి సి సి బి చైర్మన్ రెడ్డెమ్మ, రేస్కో చైర్మన్ సెంథిల్ కుమార్, చిత్తూరు నగర మేయర్ అముద, కుప్పం మునిసిపల్ చైర్మన్ డా. సుధీర్, కుప్పం ఆర్ డి ఓ శివయ్య, డ్వామా, డి ఆర్ డి ఏ పిడిలు చంద్ర శేఖర్,తులసి, ఆర్ అండ్ బి,పి ఆర్ ఎస్ ఈ లు దేవానందం, చంద్రశేఖర్ రెడ్డి, డి ఈ ఓ పురుషోత్తం, సమగ్ర శిక్ష ఏ పి సి వెంకట రమణా రెడ్డి,ఆర్ టిసి ఆర్ ఎం జితేంద్ర నాధ్,డి టి సి బసి రెడ్డి, డిఎం &హెచ్ ఓ డా.శ్రీహరి, డి పి ఓ లక్ష్మీ,సి పి ఓ ఉమా దేవి,మెప్మా పీడీ రాధమ్మ,వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తది తరులు పాల్గొ న్నారు.
addComments
Post a Comment