నెల్లూరు, సెప్టెంబర్ 26 (ప్రజా అమరావతి): రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ వ్యవస్థలో విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ పనితీరు పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నార
ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో సోమవారం ఉదయం ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీ రాజ్ వ్యవస్థలో మార్పులు, పరిణామాలపై పీహెచ్డీ చేస్తున్న మంత్రి, తన పరిశోధనకు సంబంధించి పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రాధాన్యతను, పనితీరుకు సంబంధించి అనేక అంశాలను విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ల సమక్షంలో కూలంకషంగా వివరించారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థలో మార్పులు, పరిణామాలపై తాను చేసిన పరిశోధన అంశాలను మంత్రి చక్కగా వివరించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి 5 రెవెన్యూ డివిజన్లలోని కొన్ని గ్రామాల్లోని ప్రజల అభిప్రాయాలను సేకరించి ఈ నివేదికను రూపొందించినట్లు మంత్రి తెలిపారు. ప్రధానంగా గ్రామాల్లో ప్రజల జీవన స్థితిగతులు, వారికి అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై మంత్రి తన ప్రసంగంలో వివరించారు. ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు సకాలంలో అందుతున్నట్లు చెప్పారు. అనంతరం ప్రొఫెసర్లు, పరిశోధన విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు మంత్రి తనదైన శైలిలో సమాధానాలిస్తూ ఆకట్టుకున్నారు. అలాగే పరిశోధనకు సంబంధించి మంత్రికి ప్రొఫెసర్లు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు సుజా ఎస్ నాయర్, మధుమతి, శ్రీనివాస రావు, విజేత తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment