రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారు

 

నెల్లూరు (ప్రజా అమరావతి);


రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభ్యున్నతే ధ్యేయంగా  రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నార


ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రొసెసింగ్ శాఖామాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 

మంగళవారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని,   వెంకటాచలం మండలం,  తిక్కవరప్పాడులో  40 లక్షలతో నిర్మించిన సచివాలయం నూతన భవనాన్ని మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మండల ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో 75 లక్షలతో  నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి, ప్రహరీ గోడ నిర్మాణానికి, ఇతర మౌలిక వసతులకు మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి  శంఖుస్థాపన చేశారు. తదుపరి  మూడు లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ  శానిటరీ కాంప్లెక్స్ ను మంత్రి శ్రీ గోవర్ధర్  ప్రారంభించారు.  అనంతరం గ్రామంలో చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న  మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డికి  పెద్ద ఎత్తున  మహిళలు, అభిమానులు,  ప్రజలు  అపూర్వ  స్వాగతం పలికారు.  మంత్రి  గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  సంక్షేమ పధకాలు గురించి వివరిస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ,  వారు పొందుతున్న లబ్ధి సమాచారంతో కూడిన బుక్ లెట్‌ను అందజేశారు.

ఈ సంధర్బంగా మంత్రి  శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభ్యున్నతే ధ్యేయంగా  రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారన్నారు.  ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సాంకేతిక  కారణాలతో అర్హత ఉండి కూడా సంక్షేమ పథకాలు అందని  పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల ప్రయోజనాన్ని అందించడమే ఈ కార్యక్రమంలో ప్రధాన ఉద్దేశం అన్నారు. సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని ఆన్నీ గ్రామాల్లో  సిమెంట్ రోడ్లు, సైడు మురుగు కాలువల నిర్మాణాలతో పాటు  త్రాగునీరు , సాగునీరుకు ఇబ్బంది లేకుండా  ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రాంత ఎస్.సి లు కోరిన విధంగా ఒక కోటి 87 లక్షలతో  లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మంజూరు చేయడం జరిగిందని,  ఈ రబీకే సాగు నీరు ఇచ్చేలా యుద్దప్రాతిపదికన ముమ్మరంగా పనులు  జరుగుచున్నవని మంత్రి తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు  సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని మంత్రి తెలిపారు.  సర్వేపల్లి రోడ్డు నుండి తిక్కవరప్పాడు మీదుగా గొలగమూడి వరకు రోడ్డు మరమత్తులకు 2.88కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.  నియోజక వర్గ పరిధిలో పాతపడిన  వాటర్ ట్యాంకుల స్థానంలో కొత్త వాటర్ ట్యాంకుల నిర్మాణానికి 56 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. 

మంత్రి వెంట  తహశీల్దార్ శ్రీ నాగరాజు,  ఎంపిడిఓ శ్రీమతి సుస్మిత, సర్పంచ్ శ్రీ చిరంజీవి  వివిధ శాఖల మండల అధికారులు, ప్రజా ప్రతినిధిలు, వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


Comments