*జోరుగా హుషారుగా గడప గడపకు
*
పార్వతీపురం, సెప్టెంబర్ 6 (ప్రజా అమరావతి): పార్వతీపురం మన్యం జిల్లాలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. గడప గడపకు ప్రజా ప్రతినిధులు, అధికారులు వెళ్తూ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తున్నారు. ప్రతి కుటుంబానికి అందిన సంక్షేమ సహాయాన్ని తెలియజేస్తూ కర పత్రాలను పంపిణీ చేస్తున్నారు. మంగళ వారం, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక.రాజన్నదొర సాలూరు మండలం పసుపువాని వలస, లోవ వలస, అంటివలస, రెయ్యవాని వలస, తుపాకి వలస, గాదెల వలస గ్రామాల్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, త్రాగు నీరు సమస్య, కాలువలు, కరెంట్ స్తంభాలు మార్పు చేయాలని గ్రామస్తులు కోరారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం ప్రభుత్వం పేదల సంక్షేమమే పరమావధిగా పనిచేస్తుందని ఆయన చెప్పారు.
పార్వతీపురం మండలం చినబొండపల్లి గ్రామంలో పార్వతీపురం శాసన సభ్యులు అలజంగి జోగారావు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. బోరున వర్షంలో కురుస్తున్నా తడుస్తూ ప్రతీ గడపకు వెళ్లి ప్రజలను కలుసుకుని ప్రభుత్వం వారికి అందచేసిన సహాయాన్ని వివరించారు.
పాలకొండ మండలం యల్.యల్.పురం పెద్ద కోటిపల్లి గ్రామంలో గడప గడపకు - మన ప్రభుత్వం కార్యక్రమంలో పాలకొండ శాసన సభ్యులు విశ్వాసరాయి కళావతి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు పై ఆరా తీశారు. స్థానిక సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
addComments
Post a Comment