గాయత్రీదేవి అవతారంలో ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని బుధవారం రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు దర్శించుకున్నారు


ఇంద్రకలాద్రి (ప్రజా అమరావతి);


శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా  గాయత్రీదేవి అవతారంలో ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని బుధవారం రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు దర్శించుకున్నారు


. ఆలయ ఈవో డి. భ్రమరాంబ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును స్వగతం పలికారు.ఆలయ అర్చకులు మంత్రికి అమ్మవారి దర్శనం అనంతరం అమ్మవారి శేష వస్త్రాన్ని, చిత్రపటాన్ని,ప్రసాదాలను అందజేశారు.


అనంతరం మీడియా సెంటర్ వద్ద 

రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ గాయత్రీదేవి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందదాయకమన్నారు.  అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే సామాన్య భక్తులకు, దివ్యాంగులకు ముఖ్య అతిధులకు ఎవ్వరికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చేసిన ప్రత్యేక ఏర్పాట్లు సంతోషదాయకమని మంత్రి అన్నారు.



Comments