స్వచ్ఛ మైన గ్రామాలకు చక్కటి పారిశుధ్యం అవసరమ                  స్వచ్ఛ మైన గ్రామాలకు చక్కటి పారిశుధ్యం అవసరమ


ని, ఆ దిశ గా గ్రామం ప్రవేశం వద్ద డస్ట్ బిన్స్ ఆవశ్యకత ఎంతైనా ఉందని రాష్ట్ర బిసి సంక్షేమం, సినిమాటోగ్రఫీ, సమాచార శాఖ మంత్రి చెల్లు బోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అన్నారు.


   శుక్రవారం రామచంద్రపురం నియోజకవర్గంలోని రామచంద్రపురం, కె గంగవరం మండల స్థాయి అధికారులతో

 కె గంగవరం లోని విజయ ఫంక్షన్ హాలులో వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పై  కలెక్టర్ హిమాన్షు శుక్లా ,

 జాయింట్ కలెక్టర్ హెచ్ యం. ద్యాన్ చంద్ర, రామచంద్రపురం RDO సింధు సుబ్రహ్మణ్యం లతో పాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, రెండు మండలాల కు చెందిన మండల స్థాయి అధికారులతో సమీక్షించారు.


ఈ సమావేశంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తో కలసి రెవెన్యూ, గ్రామ, వార్డు సచివాలయాలు, రి-సర్వే, స్పందన, ఈ-క్రాప్, హౌసింగ్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, CCRC కార్డ్స్, PR ఇంజినీరింగ్, DRDA, MGNREGS, RWS, ఫిషరీస్, అగ్రికల్చర్, హార్టికల్చర్, పశుసంవర్ధక, విద్య,విద్యుత్, కార్మిక శాఖ లకు సంభందించిన అంశాలను గ్రామ స్థాయి లో సమీక్షించారు.


ఈ సమావేశంలో మంత్రి వేణుగోపాలకృష్ణ పాల్కొన్నారు.


 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రామచంద్రపురం పురపాలక సంఘం లో స్వచ్చ సంకల్పం మంచి ఫలితాలు      ఇస్తున్నాయని ఆ దిశగా నియోజకవర్గంలో ని ప్రతి గ్రామంలో డస్ట్ బిన్స్ విధానం అవలంబించాలన్నారు. దీనికోసం గ్రామపంచాయతీ నిధులు వెచ్చించాలని DPO కు సూచించారు. గ్రామ ప్రవేశంలో లక్ష రూపాయల తో భూమి లో డస్ట్ బిన్ ఏర్పాటు చేసి అందులో  చెత్త ను వేస్తే మంచి ఫలితాలు వస్తాయి అన్నారు. ఈ విధానం వలన పర్యావరణ పరిరక్షణతో పాటు చెత్త ను రీసైక్లింగ్ చెయ్యవచ్చునన్నారు.

పరిపాలన వికేంద్రీకరణ లో భాగంగానే జిల్లాల విభజన జరిగిందన్నారు.  సామాన్యులు తమ సమస్యల పరిష్కారం కోసం గ్రామ సచివాలయలకు వస్తూంటారని వారికి చిత్త శుద్ధి తో పనిచేసి పెట్టే బాధ్యత ఉద్యోగుల పై ఉందన్నారు.

 త్వరలో రామచంద్రపురం-ద్రాక్షరామం రోడ్డు పనులు ప్రారంభం అవుతాయని, ద్రాక్షరామం వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు వుండవని మంత్రి తెలిపారు. కె.గంగవరం మండలం కోట గ్రామంలో కలుషిత నీటి పట్ల కలెక్టర్  స్పందించి తక్షణం 14 లక్షల రూపాయల తో పైపులైన్లు పరిశుభ్ర పర్చడాని కి కలెక్టర్ హిమాన్షు శుక్లా తీరు ను మంత్రి అభినందించారు. అదేవిధంగా సమస్యల పరిష్కారాల కోసం జిల్లా యంత్రగాన్ని నియోజకవర్గ స్థాయి లో తీసుకొనిరావడం పట్ల కలెక్టర్ చొరవ ను మంత్రి కొనియాడారు.

అక్టోబరు నుండి ముఖ్యమంత్రి ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు చేయాలని సంకల్పంతో ఉన్నారని ఆ దిశ గా వైద్యాధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. ఆక్వా చెరువుల వలన పరిసరాల్లో త్రాగునీరు కలుషితమవుతున్నాయని వాల్టా చట్టం అమలు చేయాలని ఆక్వా జోన్ గుర్తించిన ప్రాంతాల్లో మాత్రమే అనుమతులు ఇవ్వాలన్నారు. రామచంద్రపురం లో 80 లక్షల రూపాయల తో రైతు బజార్  పనులు త్వరలో ప్రారంభం అవుతాయని టెండర్ ప్రక్రియ పూర్తి అయిందన్నారు.


          కలెక్టర్   మాట్లాడుతూ ప్రభుత్వ  ప్రాధాన్యత అంశాలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల  అమలులో విధి నిర్వహణ లో నిర్లక్ష్యం వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

వైద్యాధికారులు PHC లు, CHC లు తప్పనిసరిగా సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించాన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ శాఖల వారిగా సమీక్షిస్తూ ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు ఏ దశలో ఉన్నాయి, ఎప్పటికీ పూర్తి అవుతాయి వీటి నిర్మాణాలకు మెటీరియల్ ఎంత వుంది అనే అంశాలు పంచాయతీ రాజ్, రోడ్లు భవనాలు, ఇరిగేషన్ ఇంజినీర్ల ను అడిగి లక్ష్యాలకు అనుగుణంగా పనులు పూర్తి చేయాలని దిశా నిర్దేశం చేసారు. వెల్ల జగనన్న కాలని కి సంబందించి విద్యుత్ సబ్ స్టేషన్ కు కావలసిన స్థలం కేటాయించే విధంగా తహసిల్దార్ కు ఆదేశించారు.

పశుసంవర్ధక శాఖ అధికారులు జిల్లాలో పశువులకు లంప్ స్కిన్ వ్యాధి లేదని దీని కోసం ఇప్పటికే 20 వేల డోసులు సిద్ధం చేయడం జరిగిందన్నారు.

ICDS కు సంబందించి అద్దె భవనాల వివరాలు అందించాలని PD ICDS ని కలెక్టర్ ఆదేశించారు.


ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జేడీ వై. ఆనందుకుమారి, PD ICDS GV సత్యవాణి, DPO కృష్ణవేణి, DCH, PDDRDA , పశుసంవర్ధక శాఖ DD A. చంద్రపాల్, హార్టికల్చర్ DD V. మురళీధర్  రామచంద్ర పురం మునిసిపల్ కమీషనర్ కె.శ్రీకాంత్ రెడ్డి

తదితరులు పాల్కొన్నారు.

Comments