ప్రజల వద్దకు ప్రభుత్వమే నేరుగా వెళ్లి, వారికి అందిన సంక్షేమ పథకాలను వివరించడం


నెల్లూరు, సెప్టెంబర్ 25 (ప్రజా అమరావతి): ప్రజల వద్దకు ప్రభుత్వమే నేరుగా వెళ్లి,  వారికి అందిన సంక్షేమ పథకాలను వివరించడం


, వారు సూచించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పునరుద్ఘాటించారు. 

 ఆదివారం సాయంత్రం మనుబోలు మండలం జట్ల కొండూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం  కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రతి గడపగడపకు వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడేళ్ల తమ ప్రభుత్వ పాలనలో అమలు చేసిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఏ మేరకు ప్రజలకు చేరాయో తెలుసుకోవడానికి, వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడానికి చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు సమగ్రంగా సంతృప్తికరంగా అందించడం పట్ల ప్రజలు తమ సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. జట్ల కొండూరు గ్రామంలో సుమారు 20 కుటుంబాలకు రూ 4 లక్షల నుంచి గరిష్టంగా 7 లక్షల వరకు లబ్ధి చేకూరడం తమ ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనమన్నారు. గ్రామాలను అన్నివిధాలా అభివృద్ధి చేయడం, సంక్షేమ పథకాలను సమగ్రంగా ప్రజలకు అందించడమే లక్ష్యంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. గ్రామాల్లో ప్రజలు కోరిన అభివృద్ధి పనులను చేపట్టేందుకు ఒక్కొక్క సచివాలయానికి 20 లక్షలు ముఖ్యమంత్రి మంజూరు చేసినట్లు చెప్పారు. ఈ నిధులతో గ్రామాలకు అవసరమైన పనులు చేపట్టనున్నట్లు వివరించారు. 

 ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశ్వర్లు, తాసిల్దార్ సుధీర్, ఎంపీపీ జి వజ్రమ్మ, జెడ్పిటిసి చిట్టమూరు అనితమ్మ, సర్పంచ్ కట్టమూరి నాగమ్మ, స్థానిక ప్రజా ప్రతినిధులు,  మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 

Comments