ఆస్పత్రిలో సేవలు సంతృప్తినిచ్చాయి

 ఆస్పత్రిలో సేవలు సంతృప్తినిచ్చాయి


 కాకినాడ జిజిహెచ్ సూపరింటెండెంట్ వెంకట బుద్ధ పదవీ విరమణ 

  కాకినాడ, సెప్టెంబర్ 30 (ప్రజా అమరావతి): తాను పనిచేసిన సుమారు ఏడాదిన్నర కాలంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేసిన సేవలు తనను ఎంతగానో సంతృప్తినిచ్చాయని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ పి వెంకట బుద్ధ పేర్కొన్నారు. శుక్రవారం బుద్ద పదవీ విరమణ సందర్భంగా ఆస్పత్రిలోని ఆయన చాంబర్ వద్ద ఉన్న హాలులో మినిస్టీరియల్, ఫార్మసీ, పారామెడికల్ సిబ్బంది ఆధ్వర్యంలో ఘనంగా బుద్ద దంపతులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

   ఈ కార్యక్రమానికి రంగరాయ మెడికల్ కళాశాల, ఆస్పత్రిలో ఉన్న వివిధ విభాగాధిపతులు హాజరై బుద్ధ దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బుద్ధ మాట్లాడుతూ తాను పదవి బాధ్యతలు చేపట్టిన ఏడాదిన్నర కాలంలో ఆసుపత్రిలో పలుచోట్ల రోగుల అవసరాల కోసం వివిధ నిర్మాణాలు చేపట్టినట్లు చెప్పారు. అలాగే కోవిడ్ వంటి వచ్చినా తట్టుకునే విధంగా సిబ్బందిని, సౌకర్యాలను సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. తనను ఈ ఏడాదిన్నర కాలంలో ఆదరించిన వైద్యులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బుద్ధ దంపతులకు వైద్యులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. 

  ఈ కార్యక్రమంలో ఆర్ఎంసి  ప్రిన్సిపాల్ డాక్టర్ డివిఎల్ నరసింహం, ఆర్ఎంఓ అనిత, వైద్యులు హరి విజయకుమార్, ఉమామహేశ్వరరావు, లక్ష్మోజి నాయుడు, సుధీర్, కృష్ణ సాయి, ఉద్యోగుల సంఘం నాయకులు పి శ్రీనివాసరావు, పి మూర్తి బాబు, వై పద్మ మీనాక్షి, జీ రామ్మోహన్రావు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Comments