శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఐదవ రోజున శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనం ఇస్తారు.



ఇంద్రకీలాద్రి: సెప్టెంబర్ 29, (ప్రజా అమరావతి);


శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఐదవ రోజున శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనం ఇస్తారు.



అమ్మవారు శ్రీ చక్ర అధిష్టానశక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రాధిదేవతగా వేంచేసి తననికొలిచే భక్తులను, ఉపవాసకులను అనుగ్రహిస్తున్నది. శ్రీ లక్ష్మీదేవి, శ్రీ సరస్వతి దేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తూవుండగా చిరుమందహాసంతో, వాత్సల్య రూపిణీగా చెరకుగడను చేతగపట్టుకుని శివుని వక్షస్థలంపై కూర్చుని శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడుగా, శ్రీ  అమ్మవారు త్రిపుర సుందరీ దేవిగా భక్తుల చేత పూజలందుకుంటున్నారు.

Comments