*దివ్యాంగులు, వృద్ధులు భక్తికి స్వచంద సేవలుతోడై ......*
*దివ్యాంగులకు, వృద్ధులకు ప్రత్యేక సమయాలు కేటాయింపు..*
శరన్నవరాత్రుల్లో ప్రతి ఒక్కరు ఒక్క రోజైనా అమ్మవారిని దర్శించుకోవాలని కోరుకుంటారు. వివిధ మార్గాల ద్వారా కొండకు చేరుకొని అమ్మవారి దర్శనంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. అదే రీతిగా దివ్యాంగులు, వృద్ధులు కూడా అమ్మవారిని దర్శించుకోవాలనే తపనతో ఉంటారు. అవయవాలు సహకరించకపోయిన ఎలాగైనా అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదం పొందాలనే ధ్యేయంతో కొండకు బయలుదేరిన దివ్యాంగులు, వృద్ధులకు స్వచ్ఛంద సేవకుల సహాయం వెలకట్టలేనిది. కొండకు చేరుకున్న దివ్యాంగులు, వృద్ధులను వెంటనే స్వచ్ఛంద సేవకులు వీల్ చైర్లు, బ్యాటరీ వాహనాలలో ఎక్కించుకొని స్వయంగా అమ్మవారి దర్శనాన్ని చేయించి తిరిగి వాహనాలు ఎక్కించే వరకు తోడై ఉంటున్నారు. వీరు అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు సమయాలను కేటాయించడం జరిగింది. ఈ విధంగా ఎందరో దివ్యాంగులు, వృద్ధులకు అమ్మవారి దర్శనం కల్పించేందుకు సహాయపడుతున్న స్వచ్ఛంద సేవకులు ధన్యులు.
addComments
Post a Comment