పోలవరం డయాప్రంవాల్ విషయంలో ఎన్.హెచ్.పి.సి. నిర్థారణ తదుపరే ముందుకు వెళతాం

 *రాష్ట్రంలో జలయజ్ఞానికి ఆద్యుడు డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి.

*•పోలవరంతో సహా 26 ప్రధాన ప్రాజెక్టుల పనులను  ఆ మహాను బావుడే ప్రారంభించాడు*

*•ఆయన కలలను సాకారం చేస్తున్నది ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన రెడ్డి*

*•అదే తరహాలో సంగం, నెల్లూరు బ్యారేజీలను పూర్తిచేసి జాతికి అంకితం చేయడమైంది*


*•పోలవరం డయాప్రంవాల్ విషయంలో ఎన్.హెచ్.పి.సి. నిర్థారణ తదుపరే ముందుకు వెళతాం


*

*రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు*


అమరావతి, సెప్టెంబరు 7 (ప్రజా అమరావతి):   మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా.వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో జలయజ్ఞాన్ని ప్రారంభించిన అపర భగీరదుడని, ఆ మహానుబావుడు పోలవరంతో సహా 26 ప్రధాన ప్రాజెక్టుల పనులను ప్రారంభిస్తే, ఆయన వారసుడైన  ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి  వారి కలలను సాకారం చేస్తూ  ప్రాజక్టులను పూర్తిచేస్తున్నాడని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కొనియాడారు.  అదే తరహాలో ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లాలో పెన్నానదిపై నిర్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ మరియు నెల్లూరు బ్యారేజీ పనులను  రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పూర్తిచేసి  ఈ నెల 6 న జాతికి అంకితం చేయడమైందన్నారు.  అయితే ప్రధాన ప్రతి పక్షం ఈ విషయాన్ని వక్రీకరించడం ఎంతో సోచనీయమని ఆయన అన్నారు.  బుధవారం సచివాలయం నాల్గో బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ 2008 లో మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ పనులను మరియు  2006 లో నెల్లూరు బ్యారేజీ పనులను మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా.వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారన్నారు. పలు ప్రభుత్వాల హయాంలో సుమారు 16 సంవత్సరాల పాటు కొనసాగిన  ఈ  రెండు ప్రాజక్టుల పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పూర్తిచేసి  జాతికి అంకితం చేశారన్నారు. మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ పనులను రూ.335.8 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టగా, ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వ హయాంలో రూ.30.85 కోట్లను,గత ప్రభుత్వ హయాంలో రూ.86.01 కోట్లను వెచ్చిస్తే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రూ.131 కోట్లను వెచ్చించడం జరిగిందని ఆయన స్పష్టంచేశారు. అదే విధంగా  నెల్లూరు బ్యారేజీ పనులను  రూ.274.83 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టగా,  రాష్ట్ర విభజనకు ముందు  రూ.86 కోట్లను,గత ప్రభుత్వ  హయాంలో రూ.71 కోట్లను వెచ్చిస్తే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రూ.77.37 కోట్లను వెచ్చించడం జరిగిందని ఆయన స్పష్టంచేశారు.  ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు దాదాపు రూ.610 కోట్లను వెచ్చించగా, ఇందులో కేవలం రూ.157.55 కోట్లను మాత్రమే ప్రధాన పత్రి పక్ష పార్టీ హయాంలో వెచ్చించడం జరిగిందని ఆయన  స్పష్టం చేశారు.  అయితే  ఈ విషయాన్ని వక్రీకరిస్తూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులు పలు రకాలుగా విమర్శించడం ఎంతో దురదృష్టకరమన్నారు. 

                                                                                                                                                                                             *పోలవరం విషయంలో ఎన్.హెచ్.పి.సి.నిర్థారణ తదుపరే ముందుకు వెళతాం……..*

                                                                                                                                                                                         పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాదానం చెపుతూ పోలవరం డయాప్రం వాల్ దెబ్బతిందని అందరూ అంటున్నారు, అదే అభిప్రాయంలో మేమూ ఉన్నామన్నారు. అయితే అది ఎంత మేరకు దెబ్బతిందో నిర్థారించేందుకు అవసరమైన శాస్త్రీయ అధ్యయం చేసే పరిజ్ఞానం కేవలం ఒక్క  నేషనల్ హైడ్రాలిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్.హెచ్.పి.సి.) కి మాత్రమే ఉందన్నారు.  ఈ విషయంలో అధ్యయనం చేయాల్సినదిగా సెంట్రల్ వాటర్ కమిషన్ ఇప్పటికే ఆ సంస్థను కోరడం జరిగిందన్నారు.  వాతావరణ పరిస్థితులు అన్నీ అనుకూలిస్తే  నేషనల్ హైడ్రాలిక్ పవర్ కార్పొరేషన్ ఈ అధ్యయనాన్ని పూర్తిచేసి  నిర్థారించిన తదుపరి మాత్రమే ఎర్తు కమ్ రాక్ ఫిల్లింగ్ పనులు నిర్వహించడం జరుగుతుందని, అప్పటి వరకూ  ఈ విషయంలో ఎటు వంటి చర్యలు తీసుకునేందుకు అవకాశం లేదని మంత్రి స్పష్టంచేశారు. 


గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే  పోలవరం ప్రాజక్టు నిర్మాణంలో పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయని మంత్రి తెలిపారు. విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్టును నిర్మించాల్సి ఉందని, అయితే గత ప్రభుత్వం తామే చేపట్టి 2018 కల్లా జాతికి అంకితం చేస్తామని  ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను చేపట్టిందన్నారు.  తొలుత ముంపుకి గురవుతున్న 54 గ్రామాలను తరలించి, కాపర్ డ్యామ్ ను నిర్మించిన తదుపరి మాత్రమే  డయాప్రం వాల్ ను నిర్మించాల్సి ఉందన్నారు. అయితే గత ప్రభుత్వం ఈ విదానాన్ని అనుసరించకుండా నేరుగా  డయాప్రం వాల్ ని నిర్మించడం వల్లే ఈ సమస్య ఉత్పనమైందని మంత్రి స్పష్టం చేశారు.


 

Comments
Popular posts
అర్హులైన వారందరికీ వర్తించేలా వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరవ రోజున శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మి గా దర్శనమిస్తారు.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏడవ రోజున శ్రీ కనక దుర్గమ్మ వారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు.
Image
అక్టోబరు 25న ఇ–క్రాపింగ్‌ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శన, షెడ్యూల్‌ వివరించిన సీఎం.
Image
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి.
Image