నెల్లూరు,సెప్టెంబర్ 4 (ప్రజా అమరావతి); రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించు ప్రదేశాల్లో భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాల
ని జిల్లా కలెక్టర్ శ్రీ కేవీఎన్. చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 6 వ తేదీన జిల్లాలో పర్యటించు సందర్భంగా ఆదివారం ముందస్తు భద్రత ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు జిల్లా పోలీసు అధికారి శ్రీ సిహెచ్ విజయ రావు, సంయుక్త కలెక్టర్ అర్. కూర్మానాధ్ లతో కలిసి సంగం, నెల్లూరులలో పరిశీలించారు.
తొలుత వారు సంగం లోని గురుకుల పాఠశాల ఎదురుగా ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడును పరిశీలించి పక్కగా మూడు వరసల భారీ కేడింగ్ తో కట్టుదిట్టంగా భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు.
అనంతరం మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజీ ని సందర్శించి అక్కడ పైలాను, రిమోట్ కంట్రోల్ తో బ్యారేజ్ గేట్ల ఎత్తివేత, శ్రీ వైయస్సార్, శ్రీ మేకపాటి గౌతంరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించే కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ ఎస్పీతో చర్చించి భద్రత ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. నీటి విడుదల, విగ్రహాల ఆవిష్కరణకు సంబంధించి జలవనుల శాఖ అధికారులకు ప్రత్యేకంగా పలు సూచనలు చేశారు.
తదనంతరం మండల కేంద్రమైన సంగం లోని కలిగిరి రోడ్డు మార్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రదేశాన్ని జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ తదితర అధికారులతో కలిసి సందర్శించారు. ముఖ్యమంత్రి రాకపోకలకు, గ్రీన్ రూము, వేదిక ఏర్పాట్లు, ప్రముఖులకు, రైతులకు, ప్రజలకు, మీడియా ప్రతినిధులకు ప్రత్యేకించి గ్యాలరీలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ సంగం, నెల్లూరు ప్రాంత ప్రజలు ముఖ్యంగా రైతుల చిరకాల వాంఛ ఈ నెల 6 వ తేదీన నెరవేరనుందన్నారు. సంగం, నెల్లూరు బ్యారేజ్ ల నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆ రోజున ఉదయం 10:40 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకు వస్తారని ముందుగా మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజీ ప్రారంభించాక బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. ఇది ఆయకట్టుదారులందరికీ ఎంతో ఆనందకరమైన విషయమని, వారు ఇందులో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారన్నారు. బహిరంగ సభకు దాదాపు 15 వేల మంది ప్రజలు పాల్గొనవచ్చని అంచనా వేశామని ఆమేరకు వారికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రాకపోకలు, కాన్వాయ్, రెండు బ్యారేజీలు వద్ద ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయన్నారు. సంగం, నెల్లూరు బ్యారేజ్ ల వద్ద గేట్లు ఎత్తివేత, సంగం, కోవూరు హెలిప్యాడ్ లు, పైలాన్లు, విగ్రహాల ఆవిష్కరణ పక్కాగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. అన్ని ప్రభుత్వశాఖలను సమన్వయం చేసుకొని అన్ని కార్యక్రమాలు సజావుగా నిర్వహిస్తున్నామన్నారు. వేడి వాతావరణం, వర్షాలు పడే పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అన్నిటికీ తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బ్యారేజి ల ప్రారంభోత్సవ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ అంబటి రాంబాబు, రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి ఎప్పటికప్పుడు రెండు బ్యారేజీల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు మార్గ నిర్దేశం చేశారన్నారు. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణం వలన దాదాపు 6 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించడం జరుగుతుందన్నారు. తద్వారా పలు రకాల పంటలు పండే అవకాశం ఉందని, ప్రతి ఏటా రెండు పంటలకు నీరందించే వీలు కలిగిందని దీంతో ఈ ప్రాంతం సస్యశ్యామలం కానుందన్నారు.. ఈ రెండు ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కి జిల్లా ప్రజలు ముఖ్యంగా రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.
తదుపరి కోవూరు చక్కెర ఫ్యాక్టరీ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడును జిల్లా కలెక్టర్ ఎస్పీతో కలిసి పరిశీలించారు. అనంతరం నెల్లూరు పెన్నా బ్యారేజీని కూడా జిల్లా కలెక్టర్ ఎస్పీతో కలిసి పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట అదనపు ఎస్పీలు శ్రీమతి హిమావతి శ్రీమతి చౌడేశ్వరి శ్రీ శ్రీనివాసరావు,తెలుగు గంగ ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్ శ్రీ బాపిరెడ్డి, తెలుగు గంగ ప్రాజెక్టు సి ఈ శ్రీ హరి నారాయణ రెడ్డి జగన్ జలవనరుల శాఖ ఎస్.ఈ. శ్రీ కృష్ణమోహన్ ఆత్మకూరు నెల్లూరు ఆర్డీవో లు శ్రీమతి కరుణకుమారి, శ్రీ మలోల, డి ఆర్ డి ఏ, డ్వామా పిడి లు శ్రీ సాంబ శివారెడ్డి, శ్రీ వెంకటరావు ఆర్ అండ్ బి ఎస్ ఈ శ్రీ మురళీకృష్ణ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డిఎస్పి శ్రీ యుగంధర్ డిఎస్పి శ్రీ రంగబాబు, డీఎస్పీలు శ్రీ కోటా రెడ్డి, శ్రీ హరినాధ రెడ్డి శ్రీ గాంధీ, తహసిల్దార్లు నిర్మలానంద బాబా శ్రీ వెంకటేశ్వర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment