ఏపీఐఐసీ లోగోను లాంచ్ చేసిన సీఎం వైఎస్ జగన్



*ముచ్చటగా ఏపీఐఐసీ స్వర్ణోత్సవ వేడుకలు*


*ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏపీఐఐసీ లోగోను లాంచ్ చేసిన సీఎం వైఎస్ జగన్* 



*ఏపీఐఐసీతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న పరిశ్రమల మంత్రి*


*ఏపీఈడీబీ వెబ్ సైట్ ఆవిష్కరించిన మంత్రి గుడివాడ అమర్ నాథ్*


*వేడుకల్లో ప్రత్యేకార్షణగా సాంస్కృతిక కార్యక్రమాలు*


*49 ఏళ్ళ పారిశ్రామిక ప్రగతిలో 'ఏపీఐఐసీ పాత్ర'పై వివరాలను వెల్లడించిన వీసీ,ఎండీ సుబ్రమణ్యం జవ్వాది*


*50 వత్సరంలోకి ప్రవేశిస్తున్న ఏపీఐఐసీ గత స్మృతులు, చేపట్టిన కీలక ప్రాజెక్టులపై ప్రత్యేక వీడియో ప్రదర్శన*


*ఏపీఐఐసీ మరింత అంకితభావంతో ఉన్నత శిఖరాలు చేరాలని ఆకాంక్షించిన ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి*


అమరావతి, సెప్టెంబర్, 26 (ప్రజా అమరావతి); ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) స్వర్ణోత్సవ వేడుకలు ముచ్చటగా జరిగాయి. ముఖ్య అతిధిగా హాజరైన పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఏపీఐఐసీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. ఏపీఐఐసీలో మంత్రి తాత ఏపీఐఐసీ ప్రాజెక్టులకు సంబంధించిన  కాంట్రాక్టర్ గా బాధ్యతలు నిర్వహించినట్లు మంత్రి పేర్కొన్నారు.  ఏపీఐఐసీ 49 ఏళ్లు పూర్తి చేసుకుని 50వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కొత్త జిల్లాలు, జోనళ్లవారీగా వారోత్సవాలు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు.  ఏపీఐఐసీ డైరెక్టర్లను కలుపుకుని జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలన్నారు.   అనంతరం ఇంజనీరింగ్ పనుల పురోగతి, భూ సేకరణ,భూ కేటాయింపులు, కొనుగోళ్లు, ఆస్తి పన్ను వసూళ్ల కేటగిరిల వంటి నాలుగు రంగాల్లో అత్యుత్తమ పనితీరు ప్రదర్శించిన ఏపీఐఐసీ జోనల్ మేనేజర్లు, జోనల్ కార్యాలయాల్లోని సిబ్బందికి  మంత్రి అమర్ నాథ్ పురస్కారాలు, సర్టిఫికెట్లను  అందజేశారు. 


అనంతరం ఇదే సందర్భంలో ఏపీఈడీబీ సీఈవో సుబ్రమణ్యం జవ్వాదితో కలిసి మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఏపీఈడీబీ వెబ్ సైట్ ఆవిష్కరించారు. ప్రతి రంగానికి సంబంధించిన సమగ్ర సమాచారంతో పాటు, వివిధ రంగాల పాలసీలు కూడా ఈడీబీ వెబ్ సైట్ లో అందుబాటులోకి తెచ్చినట్లు ఈ సందర్భంగా మంత్రి అమర్ నాథ్ పేర్కొన్నారు. ఇటు స్టేక్ హోల్డర్లు, పారిశ్రామికవేత్తలకు ఎంతో ఉపయోగకరంగా సమగ్ర వనరులు ఈడీబీ వెబ్ సైట్ లో ఒక్క క్లిక్ ద్వారా తెలుసుకునే విధంగా ఏపీఈడీబీ విజన్ ప్రకారం తీర్చిదిద్దినట్లు ఏపీఈడీబీ సీఈవో సుబ్రమణ్యం జవ్వాది వివరించారు. పారిశ్రామిక పార్కులు, కారిడార్లు, పోర్టులు, విమానాశ్రయాలు, కనెక్టివిటీ వంటి సమాచారమంతా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. విదేశీ వ్యవహారాలు, కాన్సులేట్లు, రాయబారులు కూడా నేరుగా సంప్రదించేలా ఈడీబీ వెబ్ సైట్ రూపొందించిన విధానం, అందుకు కృషి చేసిన ఈడీబీ ప్రతినిధుల బృందాన్ని ఏపీఈడీబీ సీఈవో ప్రశంసించారు. వెబ్ సైట్ రూపకల్సనకు అవసరమైన సమాచారమిచ్చి, సహకరించిన పరిశ్రమల శాఖ సహా అన్ని అనుబంధ రంగాలు, వాటి  అనుబంధ విభాగాధిపతులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.


అంతకు ముందు సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఏపీఐఐసీ స్వర్ణోత్సవాలకు సంబంధించిన లోగోను   ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఏపీఐఐసీ ఛైర్మన్‌ మెట్టు గోవిందరెడ్డి, ఏపీఐఐసీ వీసీ అండ్‌ ఎండి జేవీఎన్‌. సుబ్రహ్మణ్యం, ఏపీఐఐసీ ఉన్నతాధికారులంతా ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఏపీఐఐసీకి శుభాభినందనలు వెల్లడించారు.ఇదే స్పూర్తితో మరింత వేగంగా పారిశ్రామిక పార్కులు, మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించాలన్న ముఖ్యమంత్రితో ఏడాది పాటు నిర్వహించబోయే స్వర్ణోత్సవ వేడుకల వివరాలను ఏపీఐఐసీ ఛైర్మన్, ఎండీ సీఎంతో పంచుకున్నారు.రాష్ట్ర ప్రగతిలో కీలక భూమిక పోషిస్తూ ముందుకు సాగాలని సీఎం ఆకాంక్షించారు.


ఏపీఐఐసీ మరింత అంకితభావంతో ఉన్నత శిఖరాలు చేరాలని  ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి ఆకాంక్షించారు. ఉన్నతాధికారులు, ఏపీఐఐసీ ఉద్యోగులు స్ఫూర్తి పొందేలా ఆయన వ్యక్తి అనుభవ సారాన్ని ఉదాహరిస్తూ ప్రసంగించారు. 49 ఏళ్ల ప్రయాణంలో ఏపీఐఐసీ ఎంతో సాధించిందని, మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకోవడంలో ఇంకొంత వేగం పెరగాలని ఛైర్మన్ అన్నారు. ఈ సందర్భంగా సూక్తులు, ఆదర్శనీయ కథలతో ఏపీఐఐసీ ఉద్యోగుల్లో స్ఫూర్తిని నింపారు.


50 వత్సరంలోకి ప్రవేశిస్తున్న ఏపీఐఐసీ గత స్మృతులు, చేపట్టిన కీలక ప్రాజెక్టులపై ఏపీఐఐసీ రూపొందించిన ప్రత్యేక వీడియో ప్రదర్శన అందరినీ ఆకర్షించింది. 49 ఏళ్ళ పారిశ్రామిక ప్రగతిలో 'ఏపీఐఐసీ పాత్ర'పై  వీసీ,ఎండీ సుబ్రమణ్యం జవ్వాది వివరాలను వెల్లడించారు. గణాంకాలతో సహా గత మూడేళ్లు సహా 49 ఏళ్ల ఏపీఐఐసీ చరిత్రని సాధించిన ప్రగతిని ఎండీ సుబ్రమణ్యం వివరించారు.


అనంతరం ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ యావత్ ఏపీఐఐసీ ఉద్యోగులకు శుభాభినందనలు వెల్లడించారు. పారిశ్రామిక ప్రగతిలో మరింత ముందడుగు వేయాలని ఆకాంక్షించారు.


 అంతకుముందు ఏపీఐఐసీ స్వర్ణోత్సవ వేడుకలు సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. మంత్రి అమర్ నాథ్, ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవిందరెడ్డి, ఏపీఐఐసీ డైరెక్టర్లు , ఏపీఐఐసీ వీసీ, ఎండీ, పరిశ్రమల శాఖ డైరెక్టర్, స్టీల్ కార్పొరేషన్, మారిటైమ్ బోర్డు ఎండీ షన్మోహన్ నేతృత్వంలోని బృందం ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించడం జరిగింది. అనంతరం  కూచిపూడి నృత్యాలు, వాయిద్య కచేరి, కర్ణాటక శాస్త్రీయ సంగీత గాన ప్రదర్శన అలరించాయి. గళగిరిలోని ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలో ఉత్తమ సేవలందించిన విభాగాధిపతులకూ ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవిందరెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన ఆధ్వర్యంలో పురస్కారాలను అందజేశారు. ఆస్తి పన్ను వసూళ్లలో కీలక పాత్ర పోషించిన జోనళ్ల వారీ బిల్ కలెక్టర్లకు అవార్డుతో పాటు ఒక్కక్కరికీ రూ.5వేల రివార్డును ఇచ్చారు. పారిశ్రామిక పార్కుల్లో 15 రోజుల సమయంలో ఇండస్ట్రియల్ ఎన్విరాన్ మెంట్ ఇంప్రూవ్ మెంట్ డ్రైవ్ లో మెరుగైన పనితీరు ప్రదర్శించిన  వారికి బహుమతులు అందించడంతో పాటు వారి సేవకు గుర్తుగా సర్టిఫికెట్ ను అందజేశారు.


హాజరైన పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్, ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి,ఏపీఐఐసీ డైరెక్టర్లు, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే.ఎస్. జవహర్ రెడ్డి,  ఏపీఐఐసీ వీసీ&ఎండీ సుబ్రమణ్యం జవ్వాది, పరిశ్రమల శాఖ డైరెక్టర్ గుమ్మళ్ళ సృజన, మారిటైమ్ బోర్డు ఎండీ షన్మోహన్ , పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఓఎస్డీ పద్మావతి, పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్లు ఇందిరా, వీఆర్ వీఆర్ నాయక్, జీఎస్ రావు, ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్, కంపెనీ సెక్రటరీ , సీజీఎం (అడ్మిన్, పీఆర్) శివారెడ్డి, ఈ అండ్ సీ శ్రీనివాస ప్రసాద్, ఓఎస్డీ ల్యాండ్స్  సాధన,సీజీఎం (అసెట్ మేనేజ్ మెంట్) లచ్చిరామ్, జీఎంలు గెల్లి ప్రసాద్, నాగ్ కుమార్, సీజీఎం (పర్సనల్) జ్యోతి బసు, సీజీఎం (ఫినాన్స్) సుబ్బారెడ్డి,  జీఎం(లా) రష్మి, ఎంఐఎస్ విభాగం జీ.ఎం మణిభాస్కర్, జోనల్ మేనేజర్లు సోనీ, చంద్రశేఖర్, సీతారామ్, చంద్రశేఖర్, చెరుకూరి రంగయ్య, శ్రీనివాస్, సాంబశివ, యతిరాజులు, జోనళ్ళలోని డీజెడ్ఎంలు, డీజీఎంలు, మంగళగిరి ప్రధాన కార్యాలయంలోని ఇతర అధికారులు 



Comments