ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మొదటిస్ధానం మన రాష్ట్రానిది.


కల్వటాల, కొలిమిగుండ్ల మండలం, నంద్యాల జిల్లా (ప్రజా అమరావతి);


*రామ్‌కో సిమెంట్‌ ఫ్యాక్టరీ ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌*


*ఈ సందర్భంగా మాట్లాడిన పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఏమన్నారంటే...*


అందరికీ నమస్కారం, గడిచిన మూడేళ్ళుగా రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ది గురించి ఇటీవల సీఎంగారు శాసనసభ సాక్షిగా చెప్పిన విషయం తెలిసిందే, రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని పారిశ్రామికంగా మరింత అభివృద్ది చేయడానికి, పారిశ్రామిక ప్రగతిలో ముందుకు తీసుకెళ్ళడం కోసం సీఎంగారు పడుతున్న తపన కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడులు పెట్టిన అనేక సంస్ధలు కానీ ఏ రకమైన వాతావారణంలో పరిశ్రమలు నడుస్తున్నాయి అనడానికి నిదర్శనమే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మొదటిస్ధానం మన రాష్ట్రానిది.


సీఎంగారు అందిస్తున్న సహకారంతో ఇదంతా కూడా సాధ్యమైంది. ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ ఆఫ్‌ ఆపర్చునిటీస్‌ అనే రాష్ట్రంగా, ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అనేక అవకాశాలు, సముద్ర తీరం, మౌలిక వసతులు, జాతీయ రహదారుల కనెక్టివిటీ, పోర్టుల కనెక్టివిటీ, ఇవన్నీ కూడా పరిశ్రమల రాకకు, అభివృద్దికి దోహదపడుతాయనే ఉద్దేశ్యంతో సీఎంగారు చేస్తున్న కార్యక్రమాలు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. రానున్న రోజుల్లో ఇన్ని అవకాశాలు ఉన్న రాష్ట్రంలో వీటన్నింటికి తోడు ఒక గొప్ప ముఖ్యమంత్రి మనకు ఉండటం రాష్ట్రం చేసుకున్న అదృష్టం. అనకాపల్లి నియోజకవర్గంలో కూడా రామ్‌కో ప్లాంట్‌ ఉంది, ఈ రోజు మన రాష్ట్రంలో మూడో ప్లాంట్‌ కొత్తగా ప్రారంభించడం సంతోషకరం, రామ్‌కో గ్రూప్‌ మరిన్ని ప్లాంట్‌లు రాష్ట్రంలో ఏర్పాటుచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.

Comments