సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక భూమిక

 


 *సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక భూమిక* 

 *ఉపాధ్యాయులకు టీచర్స్ డే శుభాకాంక్షలు* 

 *విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ* 


 విజయవాడ, సెప్టెంబరు 4 (ప్రజా అమరావతి);


ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు ఎంతో కీలక భూమిక వహిస్తారని అటువంటి వారిని గురుపూజోత్సవం నాడు సన్మానించుకోవడం చాలా ముదావహమని ఆదివారం నాడు  ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అనేక సంస్కరణలు అమలు చేస్తున్నారని, వాటి ద్వారా విద్యార్ధులకు మెరుగైన ప్రమాణాలతో విద్య అందేలా  ఉపాధ్యాయులందరూ పునరంకితం కావాలన్నారు. 

  ఉపాధ్యాయులంటే కేవలం తరగతి గదులకే పరిమితం కాదని, తల్లి దండ్రుల తరువాత పిల్లలు ఎక్కువగా గడిపేది టీచర్లతోనే అని, పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసేది వారేనని ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా సాంకేతికతను అందిపుచ్చుకుని విద్యా రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలని మంత్రి ఆకాంక్షించారు. 


Comments
Popular posts
అర్హులైన వారందరికీ వర్తించేలా వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరవ రోజున శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మి గా దర్శనమిస్తారు.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏడవ రోజున శ్రీ కనక దుర్గమ్మ వారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు.
Image
అక్టోబరు 25న ఇ–క్రాపింగ్‌ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శన, షెడ్యూల్‌ వివరించిన సీఎం.
Image
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి.
Image