ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన ఆల్‌ ఇండియా ష్రింప్‌ హ్యచరీస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు.


అమరావతి (ప్రజా అమరావతి);


సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన ఆల్‌ ఇండియా ష్రింప్‌ హ్యచరీస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు.



కాకినాడ వద్ద ఏర్పాటుకానున్న మేజర్‌ బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ వల్ల మత్స్యసంపద, సముద్ర ఉత్పత్తుల ఉనికికి ప్రమాదం ఏర్పడకుండా, దీని విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని, డ్రగ్‌ పార్క్‌  వ్యర్ధ జలాల డిశ్చార్జ్‌ పాయింట్‌ దూరం పెంచాలని సీఎంని కోరిన హ్యచరీస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, దీంతోపాటు అక్టోబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు సర్‌ప్లస్‌ పవర్‌ను హ్యచరీస్‌కు ప్రత్యేక కేటగిరి క్రింద ఇవ్వాలని సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ను కోరినట్లు అసోసియేషన్‌ ప్రతినిధులు వెల్లడి.


ష్రింప్‌ హ్యచరీస్‌ అసోసియేషన్‌ సమస్యలపై సానుకూలంగా స్పందించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.


ఈ సందర్భంగా సీఎంని కలిసిన ఆర్‌అండ్‌బీ శాఖా మంత్రి దాడిశెట్టి రాజా, ఆల్‌ ఇండియా ష్రింప్‌ హ్యచరీ అసోసియేషన్‌ మాజీ కార్యదర్శి కొనకంటి మదుసూధన్‌ రెడ్డి, కాకినాడ చాప్టర్‌ ప్రెసిడెంట్‌ సత్తి బుల్లి వీర్‌ రెడ్డి, నేషనల్‌ బాడీ వైస్‌ ప్రెసిడెంట్‌ వి. సత్తిరెడ్డి, అడ్వైజర్‌ ప్రత్తిపాటి వీరభద్ర కుమార్, హ్యచరీ ఓనర్స్‌ కనుమూరి ఆనంద వర్మ, ఎ.నగేష్‌ బాబు, బి.విజయ్‌కుమార్, సి. కోదండ.

Comments