రాష్ట్రంలో జరుగుతున్న హింసా రాజకీయాలను సమర్థంగా తిప్పి కొడతాం- రాష్ట్రంలో జరుగుతున్న హింసా రాజకీయాలను సమర్థంగా తిప్పి కొడతాం


- అధికారం అండతోనే చెన్నుపాటి గాంధీపై దాడి

- రెచ్చిపోతున్న వైసీపీ రౌడీ మూకల్ని కట్టడి చేయండి

- తెలుగుదేశం పార్టీ నేతల సహనాన్ని పరీక్షించొద్దు

- టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్గుడివాడ, సెప్టెంబరు 7 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో జరుగుతున్న హింసా రాజకీయాలను సమర్ధవంతంగా తిప్పికొడతామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ అన్నారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడలో శిష్ట్లా లోహిత్ ఒక ప్రకటన విడుదల చేశారు. అధికారం అండతోనే టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీపై దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెచ్చిపోతున్న వైసీపీ రౌడీ మూకలను పోలీసులు కట్టడి చేయాలని సూచించారు. కొడితే కొట్టించుకుంటున్నామని భావించడం తగదన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దని హెచ్చరించారు. వైసీపీ నేతల దాడిలో గాయపడ్డ చెన్నుపాటి గాంధీ ఆరోగ్య పరిస్థితిని టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా పర్యవేక్షించారన్నారు. ఎప్పటికప్పుడు హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యులతో ఫోన్లో సంప్రదించారన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా చెన్నుపాటి గాంధీని కలిసి పరామర్శించారని తెలిపారు. టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ చంద్రబాబు, నారా లోకేష్ లు అండగా ఉంటూ వస్తున్నారన్నారు. గత కొంత కాలంగా టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ లు, అక్రమ కేసులు పెట్టడం సర్వ సాధారణంగా మారిపోయిందన్నారు. పేదప్రజలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ల ఏర్పాటును కూడా అడ్డుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు ప్రతి విషయాన్నీ గమనిస్తూ వస్తున్నారని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో అల్లరి మూకలకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్న హింసా రాజకీయాలు, టీడీపీ నేతలపై దాడులు, వేధింపులు, అక్రమ కేసులు పెట్టడంపై రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి చంద్రబాబు లేఖ రాశారన్నారు. కుప్పం నియోజకవర్గం నుండి చంద్రబాబు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారని, ఇప్పటి వరకూ ఎన్నడూ హింసాత్మక ఘటనలు జరగలేదన్నారు. గత నెల 24, 25, 26 తేదీల్లో జరిగిన చంద్రబాబు కుప్పం పర్యటనలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ పై దాడులు చేశారన్నారు. ప్రజాస్వామ్యంలో హింస, బెదిరింపులు, వేధింపులకు చోటు లేదన్నారు. శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసులు నిస్పక్షపాతంగా వ్యవహరించేలా చూడాలని చంద్రబాబు కోరారని శిష్ట్లా లోహిత్ చెప్పారు.

Comments
Popular posts
అర్హులైన వారందరికీ వర్తించేలా వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరవ రోజున శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మి గా దర్శనమిస్తారు.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏడవ రోజున శ్రీ కనక దుర్గమ్మ వారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు.
Image
అక్టోబరు 25న ఇ–క్రాపింగ్‌ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శన, షెడ్యూల్‌ వివరించిన సీఎం.
Image
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి.
Image