ఏ గడపకు వెళ్ళినా తమ ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు నూటికి నూరు శాతం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు


నెల్లూరు, సెప్టెంబర్ 10 (ప్రజా అమరావతి): గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఏ గడపకు వెళ్ళినా తమ ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు నూటికి నూరు శాతం సంతృప్తి వ్యక్తం చేస్తున్నార


ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పునరుద్ఘాటించారు. 

 శనివారం సాయంత్రం ముత్తుకూరు మండలం పిడతా పోలూరు గ్రామపంచాయతీ జంగాల కండ్రిగ గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం  కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రతి గడపగడపకు వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడేళ్ల తమ ప్రభుత్వ పాలనలో అమలు చేసిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఏ మేరకు ప్రజలకు చేరాయో తెలుసుకోవడానికి, వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడానికి చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు సమగ్రంగా సంతృప్తికరంగా అందించడం పట్ల ప్రజలు తమ సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. త్వరలో ప్రారంభం కానున్న జెన్కో మూడో యూనిట్లో గతంలో భూములిచ్చిన మత్స్యకారులకు, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు నాన్ ఫిషర్ మాన్ ప్యాకేజీ కింద రూ 37 కోట్లను త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియోజకవర్గంలోని అర్హులందరికీ అందిస్తామన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో సుదీర్ఘంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి వివరించారు. 

 ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీమతి సుస్మిత, తాసిల్దార్ మనోహర్ బాబు, ఎంపీపీ గండవరం సుగుణమ్మ, సర్పంచ్ రాజకుమారి, స్థానిక ప్రజా ప్రతినిధులు పోలిరెడ్డి చిన్నపరెడ్డి, మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 


Comments