మహతిలో ఘనంగా గురుపూజోత్సవ వేడుకలుమహతిలో ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు తిరుపతి ,సెప్టెంబర్ 05 (ప్రజా అమరావతి): దేశాన్ని మంచి స్థాయిలో ఉంచే విధంగా ఉపాధ్యాయులు తమ బిడ్డల కన్నా చదువుతున్న పిల్లలకు నిరంతరం విద్యాబుద్ధులు నేర్పిస్తున్న మీకు పాదాలకు నమస్కరిస్తున్నానని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి అన్నారు .


సోమవారం ఉదయం స్థానిక మహతి ఆడిటోరియంలో జరిగిన గురుపూజోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొనగా తిరుపతి పార్లమెంటు సభ్యులు మద్దెల గురుమూర్తి,  జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి , అతిధులుగా పాల్గొని జ్యోతిని వెలిగించి సభను ప్రారంభించి మాజీ రాష్ట్రపతి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులు అర్పిం చి ప్రసంగించారు. 


🌼ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ ఒక ఉపాధ్యాయులుగా పని చేసిన రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా దేశానికి సేవలు లతో పాటు విజ్ఞానానికి అందించిన మహానుభావుని జన్మదినాన్ని గురుపూజోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. విద్యార్థులు , సహా ఉపాధ్యాయులు ఆయన జన్మదినాన్ని సన్మానించదలిచితే , ఆయన సూచించిన మేరకు ఆయన పుట్టిన రోజును మనం గురుపూజోత్సవం జరుపుకుంటున్నామని , ప్రతి సంవత్సరం గురుపూజోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. చదువుకున్న ప్రతి ఒక్కరూ తమ గురువులను మరిచిపోరాదని నాకు గురువుగా మంచిని బోధించి విద్యాబుద్ధులు నేర్పించిన చెంగయ్య గారి ఫోటో ఇప్పటికీ మా ఇంటిలో ఉందని అన్నారు. వేదిక మీద ఉన్న జిల్లా కలెక్టర్ కూడా ఒకప్పుడు ఉపాధ్యాయులని చదువే నేడు ఈ స్థాయికి రాగలిగారని అన్నారు. చిన్న వయసు నుండే ప్రతి బిడ్డ మీ వద్ద చదువుకుంటారని మీరు చెప్పే చదువులే వాళ్లకు దిశా నిర్దేశం అవుతాయని అన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నేడు పేదలకు కార్పొరేట్ స్థాయి విద్య అందించాలనే ఉద్దేశంతో నాడు నేడు చేపట్టారని , పాఠశాలల్లో వసతులు కల్పించారని అన్నారు . ఏ పేద విద్యార్థి చదువుకు దూరం కాకూడదని అమ్మ ఒడి , విద్యా కానుక ,విద్యా దీవెన , వసతి దీవెన వంటి పథకాలు అందిస్తూ మాతృభాషతో పాటు ఇంగ్లీషు ప్రాధాన్యతను గుర్తించి అమలు చేస్తున్నారని,  అందుకోసం ప్రతి ఉపాధ్యాయులు సహకరించాలని కోరారు . నేటి సమాజంలో ఉన్నత స్థాయిలో చదువులకు, ఉద్యోగాలకు  విదేశాలకు వెళ్లాలన్నా ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి అని గుర్తించి న సి ఎం  అమలు చేస్తున్నారని అన్నారు. 


🌼తిరుపతి పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేది గురువుల కే  సాధ్యమని దేశాల,రాష్ట్రాల, ప్రాంతాల భవిష్యత్తును నిర్ణయించేది ఉపాధ్యాయులేనని అన్నారు. ఎంతో శ్రమతో మారుమూల పల్లెలకైనా సమయానికి చేరుకుని పేద పిల్లలకు విద్యాబుద్ధులను నేర్పిస్తున్నందుకు ధన్యవాదాల ని అన్నారు. అనునిత్యం క్రమశిక్షణతో పాఠాలు నేర్పిస్తున్న ఉపాధ్యాయులకు మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అని తెలిపారు


🌼జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొత్త జిల్లా తిరుపతి జిల్లాలో మొదటిసారిగా గురుపూజ ఉత్సవం నిర్వహించి ఉపాధ్యాయులను సన్మానించుకోవడం సంతోషంగా ఉందని విద్యార్థులకు నా శుభాశీస్సులు అని తెలిపారు. సద్గురువులను గౌరవించుకుంటే సమాజాన్ని గౌరవించినట్టే అని అన్నారు. ఉపాధ్యాయుడు తెరవెనక ఉండి పిల్లలను భవిష్యత్తును తీర్చిదిద్ది ఉన్నత స్థాయికి ఎదిగేలా చేస్తున్నారని అన్నారు. ప్రైవేటు విద్యాలయాలలో కేవలం ర్యాంకుల కోసమే చదువులు ఉంటాయని , ప్రభుత్వ పాఠశాలలో ర్యాంకులతోపాటు విలువలను అందిస్తారని అన్నారు. నిరంతరం శ్రమించి విద్యా బోధన చేసి విజ్ఞానాన్ని అందిస్తున్న వారిని గురువులుగా భావిస్తారని అన్నారు కేవలం పాఠాలకే ప్రాధాన్యతనిస్తే వాళ్లని ఉపాధ్యాయులు గాని చూస్తారని అన్నారు . ఉపాధ్యాయులలో నిరంతరం గొప్ప విద్యార్థిని సృష్టించాలనే తపన రావాలని తెలిపారు. పిల్లలు చదువుతున్నప్పుడు పొరపాట్లు ఉంటే తల్లిదండ్రులు సరిదిద్దున ఒప్పుకోరని మా టీచర్ ఈ విధంగానే చెప్పారని అంటారని అందుకే ఉపాధ్యాయులుగా మీ బోధనలే పిల్లలకు ఒంట పడతాయని అన్నారు. 


సభలో విద్యాశాఖ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిని సన్మానించదలిచితే అందుకు ఉపముఖ్యమంత్రి గౌరవంగా ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారు ఒకప్పుడు ఉపాధ్యాయులని ఆ గౌరవాన్ని అతనికి ఇవ్వాలని, ఆది ధర్మమని , మరోలా భావించరాదని కలెక్టర్ ను సన్మానించారు.


తిరుపతి జిల్లాలోని ఉత్తమ సేవలు కనపరిచిన ఉపాధ్యాయులకు ఉత్తమ పురస్కారాల ప్రశంసా పత్రాలను జ్ఞాపికను అందించి ఘనంగా సత్కరించారు.


ఈ వేడుకల్లో పాఠశాలల చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలను ఆకట్టుకున్నాయి


ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులుగా జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్ నిర్వహించగా వ్యవహరించగా ఎంఈఓ లు అధ్యాపకులు ఉపాధ్యాయులు పలు కళాశాలల పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్న వారి వివరాలు


తిరుపతి అర్బన్ -

ఎన్.దుర్గాబాయ్ -జెడ్.పి.హెచ్.ఎస్, మంగళం ట్రెండ్స్, 

కె.కుమారి - ఎం.పి.పి.ఎస్ ఎస్.ఎన్.పురం, 

ఎన్.భానుమతి - ఎం.జి.ఎం మునిసిపాలిటీ తిరుపతి


తిరుపతి రూరల్ 

ఆర్.వంశీ రాజ్-జెడ్.పి.హెచ్.ఎస్ ఎం.ఆర్.పల్లి, 

వి.కె.ఫలానీ సుదర్శన్ – జెడ్.పి.హెచ్.ఎస్, తిరుచానూరు, 

పి.రామకృష్ణ – జెడ్.పి.హెచ్.ఎస్ మంగళం ట్రెండ్స్, 

ఆర్.షాజహాన్ – జెడ్.పి.హెచ్.ఎస్, ఓ టేరు,  

బి. సుహాసినీ - జెడ్.పి.హెచ్.ఎస్, చెర్లోపల్లి, 

సి.ఎన్.రవీంద్రనాథ్ రెడ్డి –  జెడ్.పి.పి.ఎస్, యోగిమల్లవరం , 

జి.కృష్ణమ్మ – ఎం.పి.పి.ఎస్ గాంధీపురం, 

వై.రాజ్యలక్ష్మి – ఎం.పి.పి.ఎస్ పైడిపల్లి


బాలయపల్లి మండలం: ఎం.విజయలక్ష్మమ్మ – ఎం.పి.పి.ఎస్. గొట్టికాడు మెయిన్,


బి.ఎన్.కండ్రిగ మండలo :

జి.జయ ప్రకాష్ - ఎం.పి.యు.పి.ఎస్. కాంచనపుత్తూరు, 

సి.రవి - జెడ్.పి.హెచ్.ఎస్, పల్లమాల, కె.సతీష్ – ఎం.పి.పి.ఎస్ లక్ష్మీపురం,  


చంద్రగిరి మండలం 

కె.కవిత , ఎం.పి.పి.ఎస్. మొండికాలవ


చిన్నగొట్టిగళ్ళు మండలం :

వి.వాని, జెడ్.పి.హెచ్.ఎస్, బాకరాపేట

చిట్టమూరు మండలం :

పి.భారత్ మహీపత్  - జెడ్.పి.హెచ్.ఎస్ చిట్టమూరు, కె.శ్రీనివాసులు , జెడ్.పి.హి.ఎస్. మల్లం 


డక్కిలి మండలం  :

సి.సుకుమార్ - ఎం.పి.పి.ఎస్. మాటుమడుగు,

సి.హెచ్. మాధవి - డి.ఆర్.బి.ఆర్. అంబేద్కర్ గురుకులం  


దొరవారిసత్రం మండలం :

పి.సుమన్ కుమార్ – ఎ.పి.మోడల్ స్కూల్, 

వి.మస్తానయ్య – జెడ్.పి.హెచ్.ఎస్ తల్లంపద్దు

గూడూరు మండలం  :


టి.సురేష్ జెడ్.పి.హెచ్.ఎస్. చెన్నూరు


కే.వి.బి.పురం మండలం  :

ఎం.శ్రీహరి – జెడ్.పి.హెచ్.ఎస్. రాజులకండ్రిగ ,

పి.వెంకటరమణ – జెడ్.పి.హెచ్.ఎస్ అంజూరు , 

షేక్ బహాబులాల్ – ఎం.పి.యు.పి.ఎస్., ఆ దవరం


కోట మండలం టి.రమేష్  - ఎం.పి పి ఎస్ , జి.రాజాపురం 


నాగలాపురం మండలం :

జే.రాజేష్ – ఎం.పి.పి.ఎస్. సుబ్బనాయుడు కండ్రిగ


నాయుడుపేట మండలం :

డి.గురవయ్య – జెడ్ పి హెచ్ ఎస్ , ఎల్.ఎ.సాగరం, 

సి.అల్లెయ్య – ఎం పి యు పి ఎస్ , భీమవరం, 

ఈ.సౌరమ్మ – ఎం.పి.పి.ఎస్. విన్నమాల , 

సి.సుబ్రహ్మణ్యం – ఎం పి పి ఎస్ వాసుదేవపురం, 


నారాయణవనం మండలం : ఎం.తిరుమలయ్య – ఎం పి పి ఎస్ నగిలేరు,


ఓజిలి మండలం :

కె ప్రసాద్ – ఈ ఎం ఆర్ ఎస్, ఓజిలి,


పాకాల మండలం :సి.రమణప్ప – జి.హెచ్.ఎస్. పాకాల, ఎం.రవీంద్రుడు -  జి.హెచ్.ఎస్. పాకాల,


పెళ్లకూరు మండలం :

బి.నాగమణి – ఎం.పి.యు.పి.ఎస్. పునబాక, 


పిచ్చాటూరు మండలం :

ఎం.జయకర్, ఎన్.సౌజన్య -  జెడ్ పి హెచ్ ఎస్, పిచ్చాటూరు, పి.వెంకటేశ్వరులు – ఎం.పి.పి.ఎస్. కీలకూడి


పుత్తూరు మండలం :

పి.హరిబాబు – జెడ్ పి హెచ్ ఎస్ రాచపాలెం, 


ఆర్.సి పురం మండలం :

ఎల్.భార్గవి – జెడ్ పి హెచ్ ఎస్ కమ్మకండ్రిగ, 

ఎస్.చంద్రారెడ్డి  - జెడ్ పి హెచ్ ఎస్ , నేతకుప్పం, 

పి.శైలేంద్ర రెడ్డి – జెడ్ పి హెచ్ ఎస్, కుప్పంబాదూరు, 

పి.వేలు – జెడ్ పి హెచ్ ఎస్, ఎన్.ఆర్.కమ్మపల్లి , 

డి.నజుని- జి.హెచ్.ఎస్ కమ్మపల్లి, పి.వి.ఎస్.ఎన్.రాజు –ఎం.పి.పి.ఎస్ కన్నికాపురం, 


రేణిగుంట మండలం :

పి. ఉమా మహేశ్వరీ - జెడ్పి హెచ్ ఎస్ రేణిగుంట , 

కె.హరి -ఎం.పి.పి.ఎస్ వి.డి. చెరువు , జయ భారతి ఎం.పి.పి.ఎస్ 

కొత్తపాళెం, పి. మురళి – జెడ్పి హెచ్ ఎస్, కరకంబాడి 


సత్యవేడు మండలం :

జి. రవీంద్ర బాబు – ఏ.పి.ఎస్.డబ్ల్యు.ఆర్.ఎస్ సత్యవేడు, లోకనాథం ఎం.పి.పి.ఎస్ అరూరు, 


శ్రీ కాళహస్తి మండలం :

సి.సుజాత – జెడ్పి హెచ్ ఎస్ తొండమనాడు,  

టి. సుధరాణి ఎం.పి.పి.ఎస్.కాలవకుంట


సూళ్ళూరు పేట మండలం : సి.రచలవాని - అంబేడ్కర్ గురుకులం, సూళ్ళూరు పేట, 


ఓ. శ్రీనివాసులు- ఎం.పి.పి.ఎస్ సూళ్ళూరుపేట 


తడ మండలం :

కే. భువనేశ్వరి – ఎం.పి.పి.ఎస్.పల్లెపాలెం, 

తొట్టంబేడు మండలం :

బి.శిరీష – ఎం.పి.పి.ఎస్. చిన్న సింగమల, 


వడమాల పేట మండలం :

ఆర్.సురేంద్ర- జెడ్ పి హెచ్ ఎస్ వడమాల పేట, 

ఏ.రామరాజు –ఎం.పి.పి.ఎస్ అయ్యన్నగారిపల్లె


వాకాడు మండలం :

భారతి –ఎం.పి.పి.ఎస్ వెంకట రెడ్డి పాళెం, 

ఎస్.నగరాజు – ఎం.పి.పి.ఎస్ బాలిరెడ్డి పాళెం వరదయ్య పాళెం :

కే. మేఘనాథ్- జెడ్ పి హెచ్ ఎస్ వరదయ్య పాళెం,


వేంకటగిరి మండలం :

విజయ భాస్కర్ రెడ్డి – ఏ.పి.టి డబ్ల్యు ఆర్.ఎస్ (బాలికలు), ఎం.మణెమ్మ - జెడ్ పి హెచ్ ఎస్ వేంకటగిరి, ఏ.వెంకటేశ్వరులు – ఎం.పి.యు.పి.ఎస్ బంగారు పేట.


ఏర్పేడు మండలం :

వై.సత్యనారాయణ - జెడ్ పి హెచ్ ఎస్ కందాడు, 


ఎర్రావారి పాళెం మండలం :

బి.టి శ్రీదేవి- ఏ.పి.మోడల్ స్కూల్ ఎర్రావారి పాళెం , ఎం.చంద్రసేఖరయ్య -జెడ్ పి హెచ్ ఎస్ నెర్రబైలు , 

డి.జగదీశ్ ప్రసాద్ - జెడ్ పి హెచ్ ఎస్ ఎర్రావారి పాళెం, 

వి.భారతి – కే.జి.బి.వి ఎర్రావారి పాళెం,


స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలు 2021-22 అందుకున్న పాఠశాలలు


1 MPPS, అచ్చమ్మ అగ్రహారం, పాకాల 2 MPUPS, దోర్శకంబాల, చందగిరి

3 ZPHS(G), చంద్రగిరి

4) mcps, బైరాగి పట్టెడ

 5 SPJNMHS, తిరుపతి

 6) కేంద్రీయ విద్యాలయం, తిరుపతి

 7. MC ప్రైమరీ స్కూల్ యానాదికాలనీ, శ్రీ కాళ హ స్తి

 8.mpUps, కంచన పుత్తూరు, B. N. కండ్రిగ

 9.MPUPS, ఎగువ కనకం పాళెం, పుత్తూరు,
Comments
Popular posts
స్పందన" లేని పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
Team Sistla Lohit's solidarity for Maha Padayatra
Image
విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati): October, 18 :- దసర శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవరోజు నిజ ఆశ్వయు శుద్ద విదియ, సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ముక్తా విద్రుడు హేమ నీల థవళచ్ఛాయైర్ముఖై స్త్రీక్షణైః యుక్తా మిందునిబద్థరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికామ్, గాయత్రీం వరదాభయాంకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మదారవింద యుగళం హస్తైర్వహంతీంభజే శరన్నవరాత్రి మహత్సవములలో శ్రీ కనకదుర్గమ్మ వారుశ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ది పొంది ముక్తా, విదృమా హేమనీల దవలవర్ణాలతో ప్రకాశించు పంచకుముఖాలతో దర్శమిచ్చే సంద్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సుయందు బ్రహ్మా, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివశిస్తుండగా త్రిముర్త్యాంశగా గాయంత్రి దేవి వెలుగొందుచున్నది. సమస్త దేవతా మంత్రాలకు గాయత్రి మంత్రంతో అనుబంధంగా ఉంది. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతే నివేదిన చేయబడతాయి. ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీ మాతను వేదమాతగాకొలుస్తూ, గాయత్రీమాతను దర్శించడం వలన సకల మంత్రసిద్ది ఫలాన్ని పొందుతారు. దసరా అనే పేరు 'దశహరా'కు ప్రతిరూపమని కొందరంటారు. అంటే పాపనాశని అని అర్థం. అమ్మవారి అలంకారమునకు రంగులు వేర్వేరుగా ఉంటాయి. దసరా పండుగ అనగానే దేశం నలుమూలలా చిన్న, పెద్ద అందిరిలోనూ భక్తి ప్రపత్తులతో పాటు ఉత్సహం, ఉల్లాసాలు తొణికిసలాడుతాయి. నవరాత్రులలో దేవికి విశేషపూజలు చేయటంతోపాటు బొమ్మల కొలువులు, అలంకారాలు, పేరంటాల వంటి వేడుకలను జరుపుకుంటుంటారు.
Image
అమరావతి రైతుల మహా పాదయాత్ర చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది
Image
మహిషమస్తక నృత్త వినోదిని స్ఫుటరణన్మణి నూపుర మేఖలా జనరక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిషూధిని.
Image