ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఐఏస్ సుబ్రమణ్యం జవ్వాది





*ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఐఏస్ సుబ్రమణ్యం జవ్వాది


*


*నీడలా వెంట నిలిచిన సీఎస్, సీఎంవో సహా ఇతర ముఖ్య అధికారులను కలిసి ధన్యవాదాలు వెల్లడి*


అమరావతి, సెప్టెంబర్, 30 (ప్రజా అమరావతి); ఐఏఎస్ సుబ్రమణ్యం జవ్వాది ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. అస్సాం కేడర్ కు చెందిన తనను జన్మనిచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 ఏళ్ల పాటు డిప్యుటేషన్ పై పని చేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు వెల్లడించారు. పరిశ్రమల శాఖ డైరెక్టర్ గా, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా,  ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థకు వైస్ ఛైర్మన్, మేనిజింగ్ డైరెక్టర్ గా, ఆంధ్రప్రదేశ్  ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ మెంట్ అథారిటీ కమిషనర్ గా వివిధ బాధ్యతలను నిర్వర్తించడంలో తనదైన ముద్ర వేశారు. ఈ సందర్భంగా మూడేళ్ల కాలంలో పారిశ్రామికాభివృద్ధి కోసం తనతో పాటు నీడలా వెన్నంటి ఉన్న కీలక ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐఏఎస్ అధికారులను శుక్రవారం ఆయన కలిశారు. అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లం, సీఎస్ సమీర్ శర్మ, ఐఏఎస్ కృష్ణబాబు సహా పలువురు కీలక ఐఏఎస్ లను కలిశారు. అనంతరం ఏపీఐఐసీ మంగళగిరి కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో సుబ్రమణ్యం జవ్వాది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనతో భాగస్వామ్యమై పని చేసిన పరిశ్రమలు, ఏపీఈడీబీ ప్రతినిధులు, ఏపీఐఐసీ ఉన్నతాధికారులు భావోద్వేగంతో ఆయనకు ఘన వీడ్కోలు పలికారు. పారిశ్రామికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించడమే కాకుండా అధికారులందరితో మసలుకున్న ప్రత్యేక శైలిని పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్లు, ఏపీఐఐసీ ఉన్నతాధికారులు కొనియాడారు. 



Comments