చేనేత రిజర్వేషన్ చట్టం పటిష్ఠంగా అమలు చేస్తాం
జిల్లా కలెక్టర్ . బసంత్ కుమార్
పుట్టపర్తి, సెప్టెంబర్ 19 (ప్రజా అమరావతి): చేనేత మగ్గుముల (ఉత్పత్తి కొరకు వస్తువుల ప్రత్యేకిం పు) చట్టం (1985) ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని చేనేత వర్గ ప్రయోజనం కొరకు టాస్క్ ఫోర్స్ కమిటీ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రీ జ న్ డిప్యూటీ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ జి రాజారావు, జిల్లా చేనేత మరియు జౌళి శాఖ అధికారి ఆర్ రమేష్, ఏడి అప్పాజీ , తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేనేత రంగానికి సంబంధించిన కార్మికులను ప్రభుత్వం ద్వారా అన్ని విధాల ఆదుకునేందుకు తమ వంతుగా కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. మన సంస్కృతి ,సాంప్రదాయాలకు చేనేత ప్రతీక అని, కాలానికి అనుగుణంగా చేనేత కార్మికుల డిమాండ్ బట్టి చీరల డిజైన్లు ఉత్పత్తులను తయారు చేయాలని సూచించారు. ముఖ్యంగా చేనేత రిజర్వేషన్ చట్టాన్ని పట్టిష్టంగా అమలు చేయుటకు అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చేనేత రిజర్వ్ చేయబడిన 11 రకాల వస్త్రాలను పవర్లూమ్స్ పై తయారు చేయరాదని అలాగే చేనేత చట్టంపై విస్తృతంగా ప్రచారం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులకు సూచించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. పవర్లూమ్స్ సంఘాల మధ్య సమన్వయం ఎంతో అవసరం అన్నారు. ధర్మవరం పట్టుచీరలకు ప్రపంచ స్థాయిలో భౌగోళిక గుర్తింపు ఉన్నందున దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. చేనేతకు సంబంధించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను కచ్చితంగా అమలు చేసే విధంగా సంబంధిత శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ధర్మవరం పట్టణంలో పవర్లూమ్ యూనిట్లకు 50 శాతం విద్యుత్ రాయితీ మరియు ఇతర రాయితీ అందించుటకు ఈరోజు తీర్మానం లో ఆమోదించటం జరిగిందని చైర్మన్ తెలిపారు.చేనేత వస్త్ర వ్యాపారస్తులు తమ వస్త్ర ఉత్పత్తులపై హ్యాండ్లూమ్ మరియు సిల్క్ మార్కును తప్పనిసరిగా ప్రదర్శించాలని తెలిపారు. రాష్ట్రంలోని అత్యధిక నేతన్న నేస్తం లబ్ధిదారులు శ్రీ సత్య సాయి జిల్లా లో ఉన్నారని తెలిపారు. సొంతం మగ్గం ఉన్న ప్రతి నేతన్న కుటుంబానికి వైయస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా ఏడాదికి రూ.24000/ అందించడం జరుగుతున్నదన్నారు. చేనేత ముద్ర పథకం ద్వారా అర్హులైన చేనేతలకు బ్యాంకుల ద్వారా ఒక్కొక్కరికి 50 వేల రూపాయల నుండి 2 లక్షలరూాపా యల వరకు రుణ సహాయం ప్రభుత్వాలు అందజేస్తున్నట్లు తెలిపారు. వైయస్సార్ పెన్షన్ కానుక ద్వారా 50 సంవత్సరాల నిండిన ప్రతి చేనేత కార్మికునికి నెలకు రూ.2500 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. చేనేత సంఘాల ప్రతినిధులు పోల రామాంజనేయులు, అమీర్ భాష , జింకా చలపతి, రవి ,చౌడయ్య ,రామచంద్రయ్య ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment