మాలాయాల పౌర్ణమి సందర్భంగా గాయత్రి మాత యజ్ఞం నిర్వహణ

 మాలాయాల పౌర్ణమి సందర్భంగా గాయత్రి మాత యజ్ఞం నిర్వహణ


ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణమునందు వెలసి ఉన్న శ్రీ శ్రీ భగవాన్ కాశిరెడ్డి నాయన ఆవరణమునందు వెలసి ఉన్న శ్రీ గాయిత్రీ మాత గుడి ఆవరణము నందు బాద్రపద మాసంలో వచ్చే మాలాయాల పౌర్ణమి సందర్భంగా గాయిత్రి మాత యజ్ఞం పూనూరు హనుమంత రెడ్డి పాల్గొని నిర్వహించారు.

ఆయన మాట్లాడుతూ బాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమిని మాలయాల పౌర్ణమి అంటారు. ఈ మాసంలో ప్రతి ఒక్కరూ పితృదేవతలకు తర్పణం వదిలి వారి ఆత్మకు శాంతింప చేసే విధంగా పూజలు నిర్వహించుకోవాలన్నారు. పితృదేవతలను సంతృప్తి పరిచినప్పుడు కుటుంబంలో శాంతి సౌభాగ్యాలు కలుగుతాయన్నారు. పితృదేవతలను నిర్లక్ష్యం చేస్తే వారి ఆగ్రహానికి గురై కుటుంబంలో అశాంతి నెలకొని ఉంటు అల్ప ఆయుష్షులు దీర్ఘ రోగస్తులు వింత జబ్బులు అంగవైకల్య పిల్లలు జన్మించడము మానసికంగా ప్రశాంతత లేకపోవడం ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడము లాంటివి సంభవిస్తాయి కావున ప్రతి ఒక్కరూ పితృదేవతలను కొలిచి వారికి సంతృప్తి పరిచినట్లుయితే అన్ని సుఖాలు జరుగుతాయన్నారు. ఈరోజు ఈ యజ్ఞంలో పాల్గొన్న వారందరికీ శాంతి సౌభాగ్యాలు కలగాలని ఈ యజ్ఞం లోక కళ్యాణం కోసం చేసేది అందరూ సుఖంగా శాంతియుతంగా ఆరోగ్యంగా ఆనందదాయకంగా జీవితాలను తీర్చిదిద్దుకోవ దానికి ఈ యజ్ఞం చాలా బాగా ఉపయోగపడతాయి ప్రతి పౌర్ణమికి అమావాస్యకు జరిగే యజ్ఞంలో  పాల్గొనాలని కోరారు.  ఈ పౌర్ణమి రోజు చేసే పుణ్య కార్యక్రమముల నుండి మంచి ఫలితాలను ఇస్తాయని శాస్త్రం తెలియజేయుచున్నది ఈరోజు చేసే దానధర్మాల యజ్ఞ కార్యక్రమాలు గొప్ప ఫలితాలను ఇస్తాయని ప్రతి ఒక్కరూ గ్రహించి సత్య ధర్మ శాంతి ప్రేమల తో వర్ధిల్లాలని కోరారు. పాల్గొన్న భక్తులకు ఆశీర్వాదము తీర్థ ప్రసాదాలతో పాటు  సూరే వేణుగోపాల్ దంపతులు అల్పాహారం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి.యస్ నారాయణరెడ్డి సంఘ సేవకులు, గాయత్రి పరివార్ సభ్యులు ప్రసూనలక్ష్మి, బచ్చు వెంకటేశ్వర్లు, లింగారెడ్డి, నికిత, ధరణి, పి విజయ, ధనమ్మ ,ఇందిరా ,నారాయణమ్మ కడప రమాదేవి, తదితర మహిళా మణులు పాల్గొన్నారు.

Comments