జిల్లా కోర్టు భవనాలను పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి
రోడ్లు, భవనాల శాఖ అధికారులతో సమావేశం
విజయనగరం, సెప్టెంబరు 17 (ప్రజా అమరావతి):
రెండు రోజుల జిల్లా పర్యటన కోసం శనివారం విజయనగరం చేరుకున్న రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణాన్ని సందర్శించారు. జిల్లా జడ్జి బి.సాయికళ్యాణ చక్రవర్తి తో కలసి రెండు అంతస్థుల్లో వున్న జిల్లా కోర్టులోని వివిధ కోర్టుల హాళ్లను హైకోర్టు న్యాయమూర్తి పరిశీలించారు. జిల్లా జడ్జి ఆయా భవనాల పరిస్థితిపై హైకోర్టు న్యాయమూర్తికి వివరించారు. బార్ అసోసియేషన్ హాలుకు వెళ్లి అక్కడ న్యాయవాదులతో కొద్దిసేపు ముచ్చటించారు. బార్ కౌన్సిల్ మాజీ ఉపాధ్యక్షుడు కె.వి.ఎన్. తమ్మన్నశెట్టి, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చుక్కా బాల భాస్కరరావు తదితరులు బార్ గురించి వివరించారు. అనంతరం జిల్లా జడ్జి ఛాంబరులో రోడ్లు భవనాల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ వి.కె.విజయశ్రీ, ఇ.ఇ.రమణ తదితరులతో కోర్టు భవనాల ప్రస్తుత స్థితిపై, కొత్త భవనాల నిర్మాణానికి అంచనాలు రూపొందించే విషయమై హైకోర్టు న్యాయమూర్తి చర్చించారు. న్యాయశాఖ ఉద్యోగులు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిని కలసి వినతిపత్రం అందించారు.
ఈ పర్యటనలో జిల్లా ఎస్.సి, ఎస్.టి ప్రత్యేక న్యాయమూర్తి షేక్ సికందర్ బాషా, ఫ్యామిలీ కోర్టు జడ్జి కె.రాధారత్నం, సీనియర్ సివిల్ జడ్జిలు జె.శ్రీనివాసరావు, బి.హెచ్‌వి. లక్ష్మీకుమారి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎల్.దేవి రత్నకుమారి, మొబైల్ కోర్టు జడ్జి జమృత్ బేగం, ఏ.డి.ఎం. బి.రమ్య, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ బి.వి.విజయలక్ష్మీ, బార్ అసోసియేషన్ ప్రతినిధులు సిహెచ్.దామోదరరావు, బొడ్డు సత్యనారాయణ, ఎల్.సత్యనారాయణ, కారు చినప్పలనాయుడు, యు.వి.రాజేష్, ఎం.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment