ప్రభుత్వ పరంగా అందించే సంక్షేమం అన్నీ వర్గాలకు చెరే విధంగా ముందుకు వెళతా

 

 రామచంద్రపురం,

సెప్టెంబర్ 28 (ప్రజా అమరావతి);


నియోజకవర్గంలో ని మహిళాలకు ఒక సేవకుడు గా పనిచేస్తూ ప్రభుత్వ పరంగా అందించే సంక్షేమం అన్నీ వర్గాలకు చెరే విధంగా ముందుకు వెళతా


నని బీసీ సంక్షేమం , సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు చెల్లు బోయిన శ్రీనివాస్ వేణు గోపాల్ కృష్ణ తెలిపారు.

బుధవారం రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం గ్రామంలో వైయస్సార్ చేయూత మూడో విడత లబ్ధిదారులతో మంత్రి సమావేశం  నిర్వహించారు .

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చేనేత, మత్స్య,బిసి, మైనార్టీ, ఎస్ సి,

 ఎస్ టి,  వర్గాల కు కష్టం వచ్చినప్పుడు తొడ్పడే విధంగా గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి అమలు జరుగుతున్నాయి అన్నారు.

సామాన్యుల కనీస అవసరాలు తీర్చడమే  లక్ష్యంగా   సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పేదవారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే విధముగా ముఖ్యమంత్రి పని చేస్తున్నారన్నారు. వృధ్యాప్యం లో ఉన్నవారికి పెన్షన్లు, మహిళల సంక్షేమం కోసం ఆసరా, చేయూత, చేదోడు,

 విభిన్న వర్గాల కోసం వాహన మిత్ర, చదివే పిల్లలకు అమ్మ ఒడి, వసతి దీవెన, విద్య దీవెన, స్కూల్ యూనిఫారం అంగన్వాడి కేంద్రాల్లో 5 సంవత్సరాల లోపు పిల్లలకు సంపూర్ణ ఆహార పోషణ ,గోరుముద్ద లాంటి సంక్షేమ పధకాలు అందించడం ద్వారా రాష్ట్రంలో ఆర్థిక స్థిరత్వం నెలకొని ఉందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఈ సందర్భంగా మంత్రి సోదాహరణంగా వివరించారు .

ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ వై యస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ కార్డు తో ఎంతో మందికి ప్రాణం పోసారన్నారు. అదే తరహాలో వై యస్ జగన్మోహన్ రెడ్డి సామాన్యులకు కార్పొరేట్ తరహాలో 3188 వ్యాధులకు వైద్య సేవలు ఆరోగ్యశ్రీ ద్వారా,

గర్భిణీ స్త్రీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా  108 కింద1088 వాహనాలు,  చికిత్స అనంతరం ఇంటి దగ్గర సేవల కోసం   ఐదు వేల రూపాయల నుండి పదివేల రూపాయలు అందించడం లాంటి అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నారన్నారు.

 పేదవాడు పేదరికాన్ని జయించాలనే ఉదేశ్యం తో ఫీజు రేయింబర్స్మెంట్ తో అనేక కుటుంబాలకు వెలుగు నిచ్చిన ఘనత స్వర్గీయ రాజశేఖరరెడ్డి దక్కిందన్నారు.

అందరకీ సమన్యాయం అందించే విధంగా బాబా సాహెబ్ డాక్టర్ బి అర్ అంబేద్కర్ రాజ్యాంగ స్పూర్తితో ముఖ్యమంత్రి పనిచేస్తున్నారన్నారు.

రైతాంగానికి చేదోడుగా నిలిచే విధంగా వారు పండిస్తున్న పంటలు అధిక ఉత్పత్తులు పొందే విధంగా  రైతు భరోసా కేంద్రాల ద్వారా శాస్త్రీయ పద్ధతిలో సలహాలు సూచనలు రైతులకు కల్పించడం ,కౌలు రైతులకు న్యాయబద్ధంగా సహాయ పడటం లాంటి ఎన్నో కార్యక్రమాలను రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయి అన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం జరిగితే భీమాతో పాటు ఇన్పుట్ సబ్సిడీ కింద రైతాంగానికి మేలు జరుగుతుందన్నారు.

రామచంద్రపురం నియోజకవర్గంలో ఇల్లు లేని వారికి 16 వేల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత తనకు లభించడం సంతోషంగా ఉందన్నారు. అదే విధముగా  రామచంద్రపురం నియోజక వర్గానికి పంట నష్టానికి129 కోట్లు దీనితో పాటు ఇన్ పుట్ సబ్సిడి 25 కోట్లు రైతాంగానికి అందాయని మంత్రి వివరించారు. రామచంద్రపురం మండలంలో వైఎస్ఆర్ మూడవ విడత కింద 3832 లబ్ధిదారులకు 7 కోట్ల రూపాయలు విడుదల కావడం మహిళల్లో చైతన్యం వస్తుందని మంత్రి తెలిపారు.

ప్రతి ఇంటి అవసరాలు తీర్చేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం పని చేస్తుందని స్వేచ్ఛ, స్వచ్ఛ, సేవ,  స్నేహ వాతావరణం కల్పించే విధంగా నియోజకవర్గానికి తీర్చిదిద్దే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ ఈ సందర్భంగా కోరారు.

ఈ సమావేశంలో మంత్రితో పాటు రామచంద్రపురం మండలానికి చెందిన ప్రజా ప్రతినిధులు,రామ చంద్రాపురం రెవిన్యూ డివిజనల్ అధికారి సింధు సుబ్రహ్మణ్యం పెద్దఎత్తున లబ్ధిదారులు పాల్గొన్నారు

    


Comments