ఘనంగా గురు పూజోత్సవం వేడుకలు
పలువురు ఉత్తమ ఉపాద్యాయులకు పురస్కారాలు, సన్మానాలు
విశాఖపట్నం, సెప్టెంబరు 5 (ప్రజా అమరావతి):
డా. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు వి ఎం ఆర్ డి ఎ బాలల ప్రాంగణం లో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భముగా పలువురు ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం గావించారు.
ఈ కార్యక్రమానికి నగర మేయరు
గొలగాని హరి వెంకట కుమారి, జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్
జె. సుబద్ర , జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున, MLA వాసుపల్లి గణేష్, MLC లు పండుల రవీంద్ర బాబు, వరుదు కళ్యాణి, వి. ఎం ఆర్ డి ఎ ఛైర్ పర్సన్ అక్కరమాని విజయ నిర్మల, పలు కార్పొరేషన్ల ఛైర్మన్ లు, ఛైర్ పర్సన్ లు, జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ, సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి శ్రీనివాస్ పలువురు
ఉపాద్యాయులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భముగా జిల్లా కలక్టరు డా. ఎ. మల్లికార్జున మాట్లాడుతూ డా. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా గురుపూజోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. గురుపూజోత్సవం సందర్భముగా ఉపాద్యాయులందరికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రతి ఒక్కరికి మొదటి గురువులు తల్లి దండ్రులు అన్నారు.
డా. సర్వేపల్లి రాధాకృష్ణ ఎన్నో రంగాలలో ప్రతిభను చూపారని, తత్వవేత్త, ఉపాధ్యాయుడు, ఉపరాష్ట్రపతి ఇలా ఎన్నో ఉన్నత మైన పదవులను అలంకరించారు.
అన్నింటిలో వారికి అత్యంత ఇష్టమైనది, సంత్నప్తి ఇచ్చినది
ఉపాద్యాయ వృత్తి అని తెలిపారన్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సమయంలో
ఉపాద్యాయుడి పాత్ర పోషిస్తారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి
అత్యధికంగా నిధుల ను కేటాయించారన్నారు. నాడు నేడు క్రింద పాఠశాల భవనాల ను, మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో కల్పించడం జరిగిందన్నారు. విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు ఇంకా కృషి చేసి జిల్లాలో
విద్వారంగాన్ని అభివృద్ధి చేయాలని కోరారు.
నగర మేయరు గొలగాని హరి వేంకట కుమారి మాట్లాడుతూ ఒక వ్యక్తి ప్రస్తుతం ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా దానికి కారణం వారి ఉపాధ్యాయులే అని అన్నారు. సమాజంలో కీలక బాధ్యత ఉపాద్యాయులదే అని,
తల్లి తండ్రుల తర్వాత పిల్లల పట్ల
అంత బాధ్యత ఉపాద్యాయులదే అన్నారు. డా.సర్వేపల్లి రాధాకృష్ణ
గారి ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని ఉపాద్యాయులకు
సూచించారు.
ఎం ఎల్ సి పండుల రవీంద్ర బాబు మాట్లాడుతూ విద్యతోనే ఇక్కడ ఉన్న వారందరము ప్రస్తుత స్థాయికి చేరుకున్నా వున్నారు. ఉపాద్యాయ వృత్తి ఎంతో పెయిన్ తో కూడిన వృత్తి అన్నారు. జీవితంలో ప్రతి దశలో ఉపాద్యాయుడు ఉంటారన్నారు.
జీవితంలో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలన్నింటిని నాడు నేడు క్రింద అభివృద్ధి పరచిందని తెలిపారు.
ఈ కార్యక్రమం లో ఇంకా
జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్
జె. సుబద్ర , MLA వాసుపల్లి గణేష్, వరుదు కళ్యాణి, వి. ఎం ఆర్ డి ఎ ఛైర్ పర్సన్ అక్కరమాని విజయ నిర్మల తదితరులు ప్రసరిగించారు.
ఈ సందర్భముగా పలువురు ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం జిల్లా కలెక్టర్, నగర
మేయరు, ఎంఎల్ సి లు, ఇతర ప్రముఖులు సన్మానం గావించారు.
కార్యక్రమం లో ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి పలు సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించారు.
addComments
Post a Comment