మచిలీపట్నం : సెప్టెంబర్ 5 (ప్రజా అమరావతి);
*ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది
* !!
---- *మంత్రి జోగి రమేష్*
* సాతూలూరులో 2 కోట్ల 24 లక్షల 54 రూపాయల వ్యయంతో జలజీవన్ మిషన్
పథకం శంకుస్థాపన
* ప్రతి వ్యక్తికీ సగటున 55 లీటర్ల నీరు అందాలనేదే లక్ష్యం
ఏ పల్లెలోనూ ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం కోట్లాది రూపాయలను విడుదల చేసి ప్రజల దాహార్తి తీర్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు.
సోమవారం మధ్యాహన్నం ఆయన పెడన నియోజకవర్గ పరిధిలోని బంటుమిల్లి మండలం సాతూలూరు గ్రామం దళితవాడలో జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా గ్రామంలో 2 కోట్ల 24 లక్షల 55 రూపాయల వ్యయంతో ఇంటింటికి వ్యక్తిగత కుళాయిల ద్వారా స్వచ్ఛమని తాగునీరు అందించే ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ, ప్రతి వ్యక్తికీ రోజుకు సగటున 55 లీటర్ల నీటిని అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందని జలజీవన్ మిషన్ పథకం ద్వారా ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. గతంలో ఒక వ్యక్తికి రోజుకు సగటున 45 లీటర్ల నీటిని అందించాలని, ఆ మేరకు తాగునీటి పథకాలను జలజీవన్ మిషన్‌లో భాగంగా విస్తరించాలని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారన్నారు. అయితే మారిన జీవన ప్రమాణాల నేపథ్యంలో సగటున ఓ వ్యక్తికి రోజుకు 55 లీటర్లు అవసరమని గుర్తించి మళ్లీ ప్రతిపాదనలను తయారు చేశారన్నారు. దశాబ్దాలుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్న ఈ ప్రాంతంలో ఇక నీటి సమస్య పరిష్కారం కానుందన్నారు.
తొలుత ఆయన పెడనలోని తన కార్యాలయం వద్ద నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపణ్యాభివృద్ధి సంస్థ ద్వార ఈనెల 10 వ తేదీన (శనివారం) పెడన సెయింట్ విన్సెంట్ పల్లోటి స్కూల్ లో ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహించుచున్నట్లు రాష్త్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి, పెడన శాసనసభ్యులు
జోగి రమేష్ తెలిపారు.
ఆ రోజు నిర్వహించే జాబ్ మేళా లో పాల్గొనే కంపెనీల వివరాలు గల బ్రోచర్ ని సంస్థ అధికారులు స్థానిక నాయకుల సమక్షం లో విడుదల చేస్తూ సుమారు 19 కి పైగా వివిధ కంపెనీలు ఈ జాబ్ మేళా లో పాల్గొననున్నారని.. పదవ తరగతి నుండి ఇంటర్ డిగ్రీ ఐటిఐ పాలిటెక్నిక్ ఇంజినీరింగ్ చదివినవారు అర్హులని ఆయన వివరించారు..అర్హతలకు తగిన విధంగా పది వేల నుండి ఇరవై ఐదు వేల రూపాయల వరకు వేతనాలు చెల్లిస్తారని నియోజకవర్గములో అర్హులైన నిరుద్యోగులు ఆ అవకాశాన్ని వినియోగించుకొని ఉపాధి పొందాలని మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్ శ్రీనివాస్ రావు తో పాటు సంస్థ అధికారులు మధు, బాబు వంగ పాల్గొన్నారు.
*సాతూలూరులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాలు పాల్గొన్న మంత్రి జోగి రమేష్*
పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి వారి సంక్షేమానికి కృషి చేసేది జగనన్న ప్రభుత్వమేనని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు.
సాతూలూరు దళితవాడలో జలజీవన్ మిషన్ ప్రాజెక్టు శంకుస్థాపన అనంతరం మంత్రి దళితవాడలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 120 గృహాలను ఆయన సందర్శించారు మొదటిగా గుజ్జు నాగలక్ష్మి , దర్శి మార్తమ్మ ,దర్శి రాజమ్మ , గుజ్జు సుధారాణి, బట్టు జయమ్మ , పీతల అన్నమ్మ ,వల్లభు ఏడుకొండలు, కూరెళ్ళ సుబ్బయ్య, గడదేశి వెంకటరమణ, దర్శి రాధమ్మ , గుజ్జు కోటేశ్వరమ్మ , గూట్ల వెంకటేశ్వరరావు, దాసరి నాగేశ్వరమ్మ , బట్టు శ్రీనివాసరావు, పాలడుగు దివ్య భారతి, మద్దాల ఆదయ్య ,తదితరుల ఇళ్లకు వెళ్లి వివిధ ప్రభుత్వ పథకాలు ఏ మేరకు అందయో ఆరా తీశారు. నివేశన స్థలాలు రానివారికి 90 రోజులలో ఇంటి స్థలం వచ్చే పథకంలో చేర్పించాలని ఆయన వాలంటీర్లకు సూచించారు. గుజ్జు కోటేశ్వరమ్మ తన కుమారుడు ప్రశాంత్ ఎంటెక్ చదివి నిరుద్యోగి గా ఉన్నాడని తనకే ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని మంత్రిని వేడుకొంది. అందుకు స్పందించిన ఆయన ఈ నెల 10వ తేదీన పెడనలో జాబ్ మేళ ఉందని అక్కడకు హాజరుకావాలని ఆమెకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సాతూలూరు గ్రామ సర్పంచ్ గోల్లా బాలస్వామి, బంటుమిల్లి జడ్పిటిసి మలిశెట్టి వెంకటరమణ, బంటుమిల్లి ఎంపీపీ వెలివెల తారాకృష్ణ ( చినబాబు), వైస్ ఎంపీపీ ఓరిమి చిన్నారి బాబు, ఏఎంసి వైస్ చైర్మన్ పాలడుగు బాబురావు, పెడన 3 వ వార్డు కౌన్సిలర్ బళ్ళా గంగయ్య, పెడన మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ ఖాజా, వివిధ శాఖల అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాలంటీర్లు సచివాలయం సిబ్బంది ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు
addComments
Post a Comment