అక్కచెల్లెమ్మల భవితకు మార్గదర్శి.. వైఎస్సార్ చేయూత
*అక్కచెల్లెమ్మల భవితకు మార్గదర్శి.. వైఎస్సార్ చేయూత**: వరుసగా మూడవ ఏడాది వైఎస్సార్ చేయూత కింద 45 - 60 మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెళ్లకు రూ. 18,750 చొప్పున ఆర్థిక సహాయం అందజేత*


*: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న అక్కచెల్లెమ్మలు*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), సెప్టెంబర్ 23 (ప్రజా అమరావతి):


*వైఎస్సార్ చేయూత పథకం అక్కచెల్లెమ్మల భవితకు మార్గదర్శిగా నిలుస్తోంది. 45 నుండి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు జీవనోపాధి కల్పన, సాధికారత, ఆర్థికస్వావలందన చేకూర్చడమే లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం వైఎస్సార్ చేయూత పథకం ప్రారంభించి అమలు చేస్తోంది. క్రమం తప్పకుండా ఏడాదికి 18,750 రూపాయల చొప్పున వరుసగా నాలుగేళ్లలో అక్క చెల్లెమ్మలకు 75 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడంతో పాటు వారికి జీవనోపాధి మార్గాలను సైతం చూపిస్తూ వారికి అండగా నిలబడుతోంది. పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వివిధ పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలకు అనేక రకాల లబ్ధి చేకూర్చింది. మహిళా లబ్ధిదారులకు కుటుంబ స్థాయిలో మెరుగైన జీవనోపాధులను అందిపుచ్చుకునే విధంగా అవకాశాలను కల్పించడం, సంపద సృష్టి, ఆదాయ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా సుస్థిరమైన జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రభుత్వ అమలు చేస్తోంది.  వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ చేయూత పథకం కింద జిల్లాలో అర్హులైన 1,11,189 మంది లబ్ధిదారులకు రూ.208.48 కోట్ల లబ్ధి చేకూర్చడం జరిగింది. వరుసగా మూడో ఏడాది కూడా ఆర్థిక సహాయం అందించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు తమ అభిప్రాయాలను తెలియజేశారు.*


*1) రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు.*

*: షేక్ జైబూన్, వైఎస్సార్ చేయూత లబ్ధిదారురాలు, తారక రామారావు కాలనీ, పుట్టపర్తి, శ్రీ సత్యసాయి జిల్లా.*


గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం నిరుపేద మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు చేయడం జరుగుతోంది. నాకు వరుసగా మూడవ ఏడాదిలో కూడా వైఎస్సార్ చేయూత పథకం కింద 18,750 రూపాయల ఆర్థిక సహాయం లభించింది. ఇందుకు ఎంతో సంతోషంగా ఉంది. నేను చిన్న స్థాయిలో హోటల్ వ్యాపారం చేస్తూ రోజుకు 500 రూపాయలు సంపాదిస్తూ నా సొంత కాళ్లపై నిలబడ్డాను. మాలాంటి నిరుపేదలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతగానో అండగా నిలుస్తున్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మా ధన్యవాదాలు. 


*2) ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు.*

*: ఆదిలక్ష్మమ్మ, వైఎస్సార్ చేయూత లబ్ధిదారురాలు, పుట్టపర్తి, శ్రీ సత్యసాయి జిల్లా.*


ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాలాంటి నిరుపేద మహిళలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. నాకు మొదటిసారి వైఎస్సార్ చేయూత పథకం కింద 18,750 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. నేను చిన్నపాటి పూల వ్యాపారం చేస్తూ జీవనోపాధి పొందుతున్నాను. నాకు ప్రభుత్వ అందించిన ఆర్థిక సహాయం ఉపయోగించుకొని వ్యాపారాన్ని మరింత అభివృద్ధి పరచుకుంటాను. మహిళలు ఆర్థికంగా ఎదిగేలా కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు.


*3. నిరుపేద మహిళ జీవితంలో వెలుగులు నింపుతున్నారు.*

*: లలితమ్మ, వైఎస్సార్ చేయూత లబ్ధిదారురాలు, బ్రాహ్మణపల్లి, పుట్టపర్తి, శ్రీ సత్యసాయి జిల్లా.*


రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరుపేద మహిళ జీవితంలో వెలుగులు నింపుతున్నారు. నాకు వైఎస్సార్ చేయూత పథకం కింద 18,750 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. నేను పాలు అమ్ముతూ జీవనాధారం పొందుతున్నాను. ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయాన్ని వ్యాపారం పెంపొందించుకునేందుకు ఉపయోగించుకుంటాను. నిరుపేద మహిళలందరూ అన్ని రంగాలలో రాణించాలని సీఎం జగనన్న వినూత్నంగా అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటన్నింటిని అమలు చేస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి అండగా నిలుస్తున్నారు. మాలాంటి పేద కుటుంబాల జీవనం భారంగా కొనసాగుతున్న పరిస్థితుల్లో వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించడం పట్ల ఎంతో ఆనందంగా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు.Comments