కేంద్రీయ విద్యాలయం తరగతులు త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు

 కేంద్రీయ విద్యాలయం తరగతులు త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు*



*: జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్*


*: కేంద్రీయ విద్యాలయానికి స్థల పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్, కేంద్రీయ సిపిడబ్ల్యుడి అధికారులు*


గోరంట్ల (శ్రీ సత్యసాయి జిల్లా), సెప్టెంబర్ 28 (ప్రజా అమరావతి):


*కేంద్రీయ విద్యాలయం తరగతులు త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం గోరంట్ల మండలంలోని పాలసముద్రం క్రాస్ వద్ద 10 ఎకరాల భూమిలో నిర్మిస్తున్న కేంద్రీయ విద్యాలయం కోసం జిల్లా కలెక్టర్ కేంద్రీయ సిపిడబ్ల్యుడి ఏడి అధికారులతో కలిసి అవసరమైన స్థలాన్ని పరిశీలించారు.*


*కేంద్రీయ విద్యాలయం భవన నిర్మాణం చేపట్టడానికి కొంత సమయం పడుతుండడంతో అప్పటివరకు తరగతులు ప్రారంభించడానికి గోరంట్ల పంచాయతీ పరిధిలోని గుమ్మయ్య గారి పల్లి క్రెడ్స్ పాఠశాల భవనాన్ని వారు పరిశీలించారు. నాసిన్ ఉద్యోగుల పిల్లల కోసం అవసరమైన మౌలిక వసతులు, త్రాగునీటి సరఫరా, మరుగుదొడ్లు, ఆటస్థలం తదితర మౌలిక సదుపాయాలపై అధికారులతో వారు అడిగి తెలుసుకున్నారు.  కేంద్రీయ విద్యాలయ  సంస్థల  పర్యవేక్షకులు ఎం.రాజేశ్వరరావు (హైదరాబాద్), సిపిడబ్ల్యూడి ఏడి ముకుంద రెడ్డి, కేంద్రీయ విద్యాలయ అనంతపురం కళాశాల ప్రిన్సిపాల్ కరీం ఖాన్, నాసిన్ ఇంచార్జ్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి, పుట్టపర్తి ఆర్డిఓ భాగ్యరేఖ, తదితరులతో కలిసి క్రెడ్స్ పాఠశాల భవనాన్ని, కేంద్రీయ విద్యాలయం నిర్మించే స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.*


*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయం కోసం ప్రతిపాదనలు పంపించడం జరిగిందని, కేంద్రీయ విద్యాలయం శాశ్వత భవన నిర్మాణం కట్టెలోపు తాత్కాలికంగా అప్పటివరకు తరగతులు ప్రారంభించడానికి గోరంట్ల పంచాయతీ పరిధిలోని గుమ్మయ్యగారి పల్లి క్రెడ్స్ పాఠశాల భవనాన్ని  ఎంపిక చేయడం జరిగిందన్నారు. తాత్కాలికంగా తరగతులు నిర్వహించేందుకు . గోరంట్ల పంచాయతీ పరిధిలోని గుమ్మయ్యగారి పల్లి క్రెడ్స్ పాఠశాల భవనాన్ని, కేంద్రీయ విద్యాలయం  నిర్మించే స్థలాన్ని అబ్జర్వర్ అసిస్టెంట్ కమిషనర్ కేంద్రీయ విద్యాలయ  పర్యవేక్షకులుఎం.రాజేశ్వరరావు, సిపిడబ్ల్యూడి ఏడి ముకుంద రెడ్డితో కలిసి పరిశీలించడం జరిగిందన్నారు. కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి, తాత్కాలికంగా తరగతులు ప్రారంభానికి అవసరమైన అవసరాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. అలాగే పాలసముద్రం గ్రామ సర్వేనెంబర్ 130-1 లో 4-62 ఎకరాలు, 131-1బి లో 5-38 ఎకరాలలో త్వరలో నిర్మాణాలు ప్రారంభించడం జరుగుతుందన్నారు.*


*ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రంగనాయకులు, మండల విద్యాధికారి గోపాల్ నాయక్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.*



Comments