ఇంద్రకీలాద్రి: అక్టోబర్ 1 (ప్రజా అమరావతి):
శరన్నవరాత్రుల్లో శ్రీ మహాలక్ష్మి గా దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని సారెను సమర్పించిన చిన్న జీయర్ స్వామి.
శనివారం విజయవాడ ఇంద్రకీలాద్రి కి చేరుకున్న చిన్న జీయర్ స్వామి కి ఆలయ ఇఓ డి.భ్రమరాంబ స్వాగతం పలికి అంతరాలయంకు తోడుకొని వెళ్లారు. అమ్మవారికి సారె సమర్పించిన అనంతరం ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్ కు చేరుకున్న చిన్న జీయర్ స్వామి పత్రికా విలేకరులతో మాట్లాడుతూ దసరా ఉత్సవాల్లో భాగంగా విజయకీలాద్రి వెంకటేశ్వర స్వామి తోబుట్టువైన కనకదుర్గమ్మ అమ్మవారికి సారెను సమర్పించడం వస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని చిన్న జీయర్ స్వామి తెలిపారు.
addComments
Post a Comment