ఈ క్రాప్ రికార్డ్స్ ధృవీకరించడానికి క్షేత్ర స్థాయి లో తనిఖీలు



నిడదవోలు  (ప్రజా అమరావతి);



*  ఈ క్రాప్ రికార్డ్స్ ధృవీకరించడానికి క్షేత్ర స్థాయి లో తనిఖీలు


 


*  100% ఈకేవైసీ పూర్తి చేసిన వి హెచ్ ఏ టి. సూర్యప్రకాష్ ను సత్కరించిన కలెక్టర్ 


* 8 సర్వే నంబర్ లలోని ఈ క్రాప్ పరిశీలించడం జరిగింది 


- కలెక్టర్ కే. మాధవీలత 



రైతులు సాగుచేసే పంటకు తప్పనిసరిగా ఈ క్రాప్ చేయించు కోవడం జరగాలని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత ఆన్నారు.


మంగళవారం నిడదవోలు మండలం లోని పురుషోత్త పల్లి, గోపవరం, పెండ్యాల గ్రామాల్లో  ఈ క్రాప్ నమోదు చేసుకున్న పలువురు రైతుల రికార్డ్స్ లను పరిశీలిచి, సదరు రైతుల నుంచి తనిఖీ నిర్ధారణ రశీదు ను కలెక్టర్ తీసుకోవడం జరిగింది. .


ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ,   సాగు చేసే  భూమిని ఖచ్చితంగా  ఈకేవైసీ లో నమోదు అయ్యేలా చూడాలని, అభిమానులు ఇందుకోసం ఆర్ బి కే , సచివాలయ వ్యవస్థ లో పని చేసే వ్యవసాయ అనుబంధ రంగంలోని సిబ్బందికి తగిన సమాచారం ఇచ్చి సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు.   భూ యజమానులు, రైతులు వారి సెల్ ఫోన్లు కి వొచ్చే  ఓ టి పి వివరాలు వ్యవసాయ సిబ్బందికి తెలియ చేసి వారి పంట ఈ క్రాప్, ఈ కేవైసి  అయ్యేలా సహకరించాలన్నారు.


రావిమెట్ల వి హెచ్ ఏ టి. సూర్య ప్రకాష్ ను సత్కరించిన కలెక్టర్


రావిమెట్ల గ్రామానికి చెందిన గ్రామ హార్టికల్చర్ సహాయకుడు టి. సూర్య ప్రకాష్ వంద శాతం ఈ క్రాప్ నమోదు చేసిన సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత  సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రకాష్ తన పనితీరులో చూపిన విధంగా ప్రతి ఒక్కరూ వారి పరిధిలో నూరు శాతం లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాలని పేర్కొన్నారు. 




 రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయి లో రైతులు సాగుచేసే పంటలకు చెందిన సాగు చేసే పంట, విస్తీర్ణం వంటి రికార్డులను, జారీ చేసిన ధృవ పత్రాలను నిర్ధారణ చేసినట్లు పేర్కొన్నారు. ఎనిమిది  సర్వే నంబర్ల లోని వ్యవసాయ భూమిలో గుర్రం సీతారత్నం (పురుషోత్తపల్లి) మూడు సర్వే నంబర్ల లో,  జీ. రాజా రావు రెండు సర్వే నంబర్ల లో, గోపవరం కి చెందిన ఏం. రంగారావు, పెండ్యాల కి చెందిన జీ. గంగరాజు, ఎన్ వి ఎస్ సత్యనారాయణ ఒక్కో సర్వే నంబర్ లలో ఆయా  రైతులు సాగు చేస్తున్న పంట, విస్తీర్ణం, తదితర వివరాలను నిర్ధారణ చేశామన్నారు. ఈ క్రాప్ యొక్క ప్రయోజనాలు  క్షేత్ర స్థాయి లో జరుగుతున్న ఈ క్రాప్ నమోదు ను పరిశీలన కోసం క్షేత్ర స్థాయి  పర్యటించినట్లు కలెక్టర్ మాధవీలత తెలిపారు. 


కలెక్టర్ వెంట  వ్యవసాయ అధికారి జి.సత్యనాయణ, హార్టికల్చర్ అధికారి గంజి రమేష్, ఇతర అధికారులు, సిబ్బంది రైతులు ఉన్నారు.



Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image