వికేంద్రీకరణ త్వరితగతిన పూర్తి అయ్యేవిధంగా ఆశీర్వదించాలి

 

ద్రాక్షారమం,

అక్టోబర్ 5 (ప్రజా అమరావతి);

రాష్ట్రంలో పేదరికాన్ని పారద్రోలే విధంగా ముఖ్యమంత్రి అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు విజయవంతం అయ్యే విధంగా ఆశీర్వదించాలని కోరుకొన్నట్లు మంత్రి చెల్లు బోయిన శ్రీనివాస్ వేణుగోపాల్ కృష్ణ తెలిపారు.

విజయదశమి సందర్భంగా బుధవారం ద్రాక్షారమలోని శ్రీ మాణిక్యాంబ సమేత

 శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకుని

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పించిన రాష్ట్ర పరిపాలన కోసం తలపెట్టిన వికేంద్రీకరణ త్వరితగతిన పూర్తి అయ్యేవిధంగా ఆశీర్వదించాల


ని కోరుతూ స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు లతో కలసి  రాష్ట్ర బిసి సంక్షేమం, సమాచార, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ చెల్లు బోయిన శ్రీనివాస్ వేణుగోపాల్ కృష్ణ అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టారు.

 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదరికం అనే పెద్ద రాక్షసి ని అంతం చేయాలనే ఉద్దేశ్యం తో ముఖ్యమంత్రి ఆశిస్తున్నారని, సంక్షేమం అనే క్యాలెండర్ తో పేదరికాన్ని నిర్ములించే విధంగా  పనిచేస్తున్నారన్నారు.

 వికేంద్రీకరణతో ముఖ్యమంత్రి రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేయాలనే తపన తో

పని చేస్తున్నారని ఆయన ఆశయానికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని మంత్రి కోరారు.


 ఈ సందర్భంగా మంత్రి శ్రీ మాణిక్యాంబ సమేతశ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకొని వేద పండితుల ఆశీర్వాదం పొందారు. 


Comments