జిల్లాకు రెడ్ క్రాస్ సేవలకు గుర్తింపుగా అవార్డు



జిల్లాకు రెడ్ క్రాస్ సేవలకు గుర్తింపుగా అవార్డు



గవర్నర్ చేతుల మీదుగా స్వీకరించిన జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్

 గవర్నర్ అవార్డు పై హర్షం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి 



విజయనగరం, అక్టోబర్ 28 (ప్రజా అమరావతి):

విజయనగరం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ అవార్డుకు ఎంపికయ్యింది. జిల్లాలో రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ సూర్యకుమారి, ఐ.ఏ.ఎస్.  నేతృత్వంలో రెడ్ క్రాస్ సంస్థలో పెద్ద ఎత్తున జీవిత సభ్యులను చేర్పించడం, రక్తదానం ప్రోత్సహించడం, సంస్థకు విరాళాలు సేకరించడం, కొవిడ్ నియంత్రణ కార్యక్రమాలు వంటి అంశాల్లో జిల్లాకు రాష్ట్ర గవర్నర్ అవార్డు లభించింది. జిల్లాకు వచ్చిన ఈ అవార్డును జిల్లా యంత్రాంగం తరపున జాయింట్ కలెక్టర్ శ్రీ మయూర్ అశోక్ రాష్ట్ర రెడ్ క్రాస్ ఛైర్మన్,  గవర్నర్ శ్రీ బిశ్వభూషన్ హరిచందన్ నుండి విజయవాడలోనీ లబ్బీపెట లో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో స్వీకరించారు. జిల్లాకు ఇండియన్ రెడ్ క్రాస్ రాష్ట్ర స్థాయి అవార్డు రావడం పట్ల జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సంస్థ జిల్లా అధ్యక్షులు శ్రీమతి ఏ సూర్యకుమారి హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో రెడ్ క్రాస్ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు మరింతగా విస్తరించడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. రెడ్ క్రాస్ సంస్థ లో సభ్యులుగా సేవా కార్యక్రమాలపై ఆసక్తి వున్నవారిని ఆహ్వానించి చేర్చుకుంటామని పేర్కొన్నారు. అవార్డు సాధనలో భాగమైన ప్రతి రెడ్ క్రాస్ కార్యకర్తను అభినందిస్తున్నట్టు కలెక్టర్ పేర్కొన్నారు.



Comments