*మైనార్టీల హక్కులు, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణే ధ్యేయం.
*
*ఏపీ మైనార్టీస్ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ కె.అహ్మద్ ఖాన్.*
మంగళగిరి (ప్రజా అమరావతి);
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మైనార్టీల హక్కులు,వక్ఫ్ ఆస్తుల పరిరక్షణే ధ్యేయమని ఏపీ మైనార్టీస్ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ కె.అహ్మద్ ఖాన్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మంగళగిరి లోని తన కార్యాలయానికి విచ్చేసి మైనార్టీ ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. ముస్లిం మైనార్టీలలో సామాజికంగా, విద్యా పరంగా వెనుకబడిన సయ్యద్ లకు కూడా బీసీ ఈ కేటగిరీ కింద సర్టిఫికెట్ లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ కె. ఇక్బాల్ అహ్మద్ ఖాన్ కు పలువురు ముస్లిం సోదరులు విజ్ఞప్తి చేశారు. మస్జీద్ లకు చెందిన కోట్లాది రూపాయిల విలువైన స్థలాలను కబ్జా చేస్తోన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.స్పందించిన రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.ఇక్బాల్ అహ్మద్ ఖాన్ మైనార్టీల సమస్యలను పరిష్కరించడంతో పాటు వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు కృషి చేయడమే ధ్యేయమన్నారు. అనంతరం ఆయన అధికారులతో కలసి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న పలు ముస్లిం మైనార్టీ కేసులపై విచారణ చేపట్టారు. త్వరితగతిన కేసులను పరిష్కరించేందుకు మైనార్టీ కమిషన్ తన వంతు కృషి చేస్తోందన్నారు.
addComments
Post a Comment