ఆరోగ్యశ్రీలో మరిన్ని వైద్య చికిత్సలు, పెంచిన వైద్య చికిత్సలను ప్రారంభించిన సీఎం.*వైద్య ఆరోగ్యశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.*


అమరావతి (ప్రజా అమరావతి);

*– ఆరోగ్యశ్రీలో మరిన్ని వైద్య చికిత్సలు, పెంచిన వైద్య చికిత్సలను ప్రారంభించిన సీఎం.


వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష సందర్భంగా క్యాంపు కార్యాలయంలో పెంచిన చికిత్సలను ప్రారంభించిన సీఎం. 

ఆరోగ్య శ్రీ కింద 3,255కి చేరిన వైద్య చికిత్సలు. కొత్తగా 809 వైద్య చికిత్సలు పెంపు.

గత ప్రభుత్వంతో పోలిస్తే ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా వైద్యం అందుతున్న చికిత్సల సంఖ్య 1059 నుంచి 3,255కు పెంపు. 

గత ప్రభుత్వంతో పోలిస్తే వైయస్‌.జగన్‌ సర్కారు పెంచిన  చికిత్సలు 2,196.

మే 2019లో ఆరోగ్య శ్రీకింద వైద్య చికిత్సల సంఖ్య 1059.

జనవరి 2020లో 2059 కి పెంచుతూ వైయస్‌.జగన్‌ సర్కారు నిర్ణయం. వైద్యం ఖర్చు వేయి రూపాయలు పైబడ్డ చికిత్సలు ఆరోగ్యశ్రీలో చేరిక. 

జులై 2020లో 2200కు పెంచుతూ నిర్ణయం. ఈ నిర్ణయం ద్వారా అదనంగా చేర్చిన చికిత్సల్లో 54 క్యాన్సర్‌ చికిత్స ప్రొసీజర్లు.

నవంబర్‌2020లో 2436 పెంపు. బోన్‌మ్యారోతో పాటు 235 ప్రొసీజర్ల చేరిక.

మే–జూన్‌2021లో 2446కు ఆరోగ్యశ్రీ చికిత్సల పెంపు. 10 కోవిడ్‌ ప్రొసీజర్ల చేరిక.

2022లో 3255 కు పెంచిన వైయస్‌.జగన్‌ సర్కార్‌. 


– చంద్రబాబు హయాంలో 2018–19 నాటికి ఆరోగ్యశ్రీ, 104, 108 పై పెట్టిన ఖర్చు మొత్తంగా రూ.1299.01 కోట్లు.


– ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో పెంచిన వైద్య చికిత్సల కారణంగా ఏడాదికయ్యే ఖర్చు రూ.2894.87 కోట్లు కాగా.. ఆరోగ్య ఆసరా కోసం(2021–22లో) సుమారు రూ. 300 కోట్లు.

– దీంతో పాటు 2021–22లో 104 కోసం వెచ్చించిన సొమ్ము రూ.114.05 కోట్లు, 108 కోసం రూ.172.78 కోట్లు.

మొత్తంగా ఆరోగ్యశ్రీ, ఆరోగ్యఆసరా, 108, 104ల కోసం అయి ఖర్చు రూ. 3481.70 కోట్లు.

– చంద్రబాబు హయాంలో కన్నా దాదాపు మూడురెట్లు అధికంగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం. 


ఆరోగ్య శ్రీ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామన్న సీఎం.

ఎక్కడా కూడా బకాయిలు లేకుండా చూస్తున్నామన్న సీఎం.

ఎంపానెల్డ్‌ ఆస్పత్రుల్లో నమ్మకం, విశ్వాసం కలిగిందన్న సీఎం.

ఇప్పుడు రోగులకు మరిన్ని వైద్య సేవలను అందుబాటులోకి తీసుకు వస్తున్నామన్న సీఎం.

104 కాల్సెంటర్‌ ద్వారా  ఆరోగ్యశ్రీ రిఫరల్‌ సర్వీసులు కూడా అందిస్తున్నామన్న అధికారులు.

ఆరోగ్య శ్రీ కింద అందుతున్న సేవలపై ఎంపానల్డ్‌ ఆస్పత్రులు, విలేజ్‌ క్లినిక్స్, ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో బోర్డులు ఉంచుతున్నామన్న అధికారులు.

పూర్తి సమాచారంతో బుక్లెట్స్‌ కూడా ఇస్తున్నామన్న అధికారులు. ఆస్పత్రులు వివరాలు, అందుతున్న సర్వీసుల వివరాలు కూడా ఇందులో ఉంచుతున్నామన్న అధికారులు.


రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు గాయపడితే అలాంటి వారికి వెంటనే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించాలని సీఎం ఆదేశం. 

ఉత్తమ సేవలు అందించిన ఆరోగ్య మిత్రలకు సేవా మిత్రలు, సేవారత్న, ఉన్నత ఆరోగ్య సేవ అవార్డులు. 


*వైద్యశాఖపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.*

*ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్, విలేజ్‌ క్లినిక్స్, నాడు – నేడు తదితర అంశాలపై సీఎం సమీక్ష.*


*ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే...:*

వైద్య ఆరోగ్య రంగంలో అనేక సంస్కరణలు, మార్పులు తీసుకు వచ్చాం: సీఎం

భారీ సంఖ్యలో మునుపెన్నడూలేని విధంగా సుమారు 46వేల పోస్టులను భర్తీచేశాం:

ప్రభుత్వ రంగంలో మెరుగైన వైద్య సేవలు, నాణ్యమైన సేవలు అందాలన్నదే లక్ష్యం:

ఆరోగ్యవంతమైన సమాజంతో మంచి ఫలితాలు వస్తాయి:

ఎక్కడ, ఎప్పుడు, ఎక్కడ ఖాళీ ఉన్నా వెంటనే గుర్తించి వాటిని భర్తీచేసేందుకు ప్రత్యేక అధికారిని కూడా నియమించాం:

సౌకర్యాలు, వసతులు, సరిపడా సిబ్బందిని ప్రభుత్వం నుంచి ఇవ్వగలిగాం:

ఇక అంకిత భావంతో పనిచేసి, ప్రత్యేక శ్రద్ధతో ఈ వ్యవస్థలను మెరుగ్గా పనిచేయించడంపై దృష్టిపెట్టాలి:

ఎక్కడా కూడా అలసత్వానికి, నిర్లక్ష్యానికి తావు ఉండకూడదు :

ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్పత్రుల్లో ఉండాల్సిన సంఖ్యలో వైద్యులు ఉండాలి:

వైద్య ఆరోగ్య శాఖలో కూడా ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ హాజరును తప్పనిసరి చేయాలి:

అక్టోబరు 21 నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌పై ట్రయల్‌ రన్‌ ప్రారంభించామన్న అధికారులు.

ప్రతి పీహె చ్‌సీలో ఇద్దరు డాక్టర్లు ఉంటారన్న అధికారులు.

మొత్తంగా ప్రతి పీహెచ్‌సీలో 14 మంది సిబ్బంది ఉంటారని తెలిపిన అధికారులు.

ప్రత్యేక యాప్‌ ద్వారా ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌  అమలువుతున్న విధానాన్ని పర్యవేక్షిస్తున్నామన్న అధికారులు.

67 రకాల మందులుతో విలేజ్‌ క్లినిక్స్‌ను ఏర్పాటు చేస్తున్నామన్న అధికారులు.

14 రకాల ర్యాపిడ్‌ కిట్లను కూడా విలేజ్‌ క్లినిక్స్‌లో అందుబాటులో ఉంచామన్న అధికారులు.

ఇప్పటికే డాక్టర్లకు 2248 సెల్‌ఫోన్లు, ట్యాబులు పంపిణీచేశామన్న అధికారులు.

మందులు సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం.

దీంట్లో భాగంగా ఇప్పుడున్న సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్లను భవిష్యత్తులో కొత్త జిల్లాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నామన్న అధికారులు.

విలేజ్‌ క్లినిక్స్‌లో ఎక్కడ మందులు అయిపోతున్నా సమీపంలో ఉన్న పీహెచ్‌సీ నుంచి వీటిని సరఫరా చేసే ఏర్పాటు చేస్తామన్న అధికారులు.

మందుల పంపిణీ, నిల్వ, కొరత తదితర అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఆన్లైన్‌ పద్ధతుల్లో పర్యవేక్షణ చేస్తామన్న అధికారులు.


మండలాల ప్రాతిపదికన ప్రతి విభాగంపైన పర్యవేక్షణ అధికారులు ఉండేలా తగిన ఆలోచనలు చేయాలన్న సీఎం.

ఎంఈవో, ఎమ్మార్వో, ఎండీవో తరహాలో ప్రతి ప్రభుత్వ విభాగంలో పనిచేసే వారిపై పర్యవేక్షణకు ఒక మండలస్థాయి వ్యవస్థ ఉండేలా తగిన ప్రణాళిక రూపొందించాలన్న సీఎం.

వైద్య ఆరోగ్యశాఖలో పనిచేసే సిబ్బందిపై కూడా మండలస్థాయిలో పర్యవేక్షణకు ఒక ఆలోచన చేయాలన్న సీఎం.

దీనిపై సరైన కసరత్తు చేసిన ప్రతిపాదనలు తనకు అందించాలన్న సీఎం. 

ఎయిర్‌ పొల్యూషన్, పారిశుద్ధ్యం, తాగునీరు, స్కూళ్లు, అంగన్‌వాడీలలో టాయిలెట్ల పరిశుభ్రతపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకోవాలన్న సీఎం.

క్రమం తప్పకుండా ఈ నివేదికలు తెప్పించుకుని, గుర్తించిన సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్న సీఎం.

రక్తహీనత కేసులను జీరోకి తీసుకు రావాలన్న సీఎం. 

ఇన్ని వ్యవస్థలను మనం తీసుకు వస్తున్నందున ఆరోగ్య రంగంలో సుస్థిర ప్రగతి లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగాలన్న సీఎం. 

స్త్రీ శిశు సంక్షేమ శాఖతో కలిసి పనిచేయాలన్న సీఎం.


ప్రసవం సమయంలో హై రిస్క్‌ ఉన్న వారిపై ప్రత్యేక దృష్టిపెట్టామన్న అధికారులు.

వీరిని ముందుస్తుగానే ఆస్పత్రికి తరలించి వారికి వైద్యంపై దృష్టిపెడతామన్న అధికారులు.

సంపూర్ణ పోషణ ద్వారా వీరికి ఆహారం సక్రమంగా అందుతుందా? లేదా? అన్నదానిపై కూడా నిరంతర పర్యవేక్షణ చేయాలన్న సీఎం.

ఆరోగ్యశ్రీ కార్డుల్లో ప్రతి ఒక్కరి హెల్త్‌ హిస్టరీని రికార్డుల్లో నిక్షిప్తం చేయాలన్న సీఎం.

దీనివల్ల ఫ్యామిలీ డాక్టర్‌ రోగులకు సరైన వైద్య సేవలు అందించగలుగుతారన్న సీఎం.

గ్రామానికి సంబంధించిన మొత్తం హెల్త్‌ రికార్డులను అందుబాటులో ఉంచుకోవాలన్న సీఎం

నిరంతరం ఈ రికార్డులను అప్డేడ్‌ చేసుకుంటూ క్యూ ఆర్‌ కోడ్‌ ద్వారా తెలుసుకునేలా ఉండాలన్న సీఎం.

వీటిని చూసి ఫ్యామిలీ డాక్టర్‌ తగిన రీతిలో సేవలు అందించగలరన్న సీఎం.


ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్‌ సమీర్‌శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టి కృష్ణబాబు, ఆరోగ్య, కుటుంబసంక్షేమశాఖ డైరెక్టర్‌ జె నివాస్, ఏపీ వైద్యవిధానపరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి వినోద్‌ కుమార్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈఓ ఎంఎన్‌ హరీంద్ర ప్రసాద్, వైద్య ఆరోగ్యశాఖ డీజీ(డ్రగ్స్‌) రవిశంకర్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఇంటర్నెట్‌లో గూగుల్ సెర్చ్‌లో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image