శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏడవ రోజున శ్రీ కనక దుర్గమ్మ వారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు.



ఇంద్రకీలాద్రి: అక్టోబర్ 1 (ప్రజా అమరావతి);


శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏడవ రోజున శ్రీ కనక దుర్గమ్మ వారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు.


 మూలా నక్షత్రం శ్రీ అమ్మవారి జన్మనక్షత్రం.  మహాకాళీ, మహాలక్ష్మి, మహా సరస్వతిగా శక్తిస్వరూపాలతో దుష్ట సంహారం చేసిన శ్రీదుర్గాదేవికి శరన్నవరాత్రి ఉత్సవాలలో మూల నక్షత్రంరోజున వాగ్దేవతామూర్తి అయినా సరస్వతీ అవతారం అలంకరించబడుతుంది.  సరస్వతిదేవిని సేవించడం వలన విద్యార్థినీ విద్యార్థులకు వాగ్దేవి అనుగ్రహంవలన సర్వ విద్యలయందు విజయం పొందుతారు.  మూలానక్షత్రం నుండి విజయదశమి వరకు విశేష పుణ్య  దినాలుగా భావించి శ్రీ దుర్గమ్మను ఆరాధిస్తారు భక్తజనుల అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించే జ్ఞానప్రదాయిని శ్రీ సరస్వతిదేవి.  శ్రీ సరస్వతిదేవి దర్శనం అఖిల విద్యాభ్యుదయ ప్రదాయకం.


Comments