కేంద్ర ప్రభుత్వం తరపున పూర్తిస్థాయిలో ఆదుకో వడానికి అనువుగా చర్యలు బృం దం తీసుకుంటుంది

 పి గన్నవరం అక్టోబర్ 11 (ప్రజా అమరావతి): ఈ ఏడాది జులై, ఆగస్టులో సంభవించిన గోదావరి వరదలు మూలంగా నష్టాలపై రూపొందించిన పోస్ట్ డిజాస్టర్ నీడ్స్ అసెస్‌మెంట్ పై జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ మరియు ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో బృందం పి గన్నవరం మండలంలో  క్షేత్రస్థాయిలో పర్య టించి,అధ్యయనం చేసిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర తెలిపారు.  మంగళవారం పి.గన్న వరం మండలం పోతవరం- కె ఏనుగుపల్లి మార్గoలో దెబ్బతిన్న ఆర్ అండ్ బి రోడ్ ను తొలుతగా బృందం పరిశీలించిoది. అనంతరం నాగులంక గ్రామంలో వరదలు మూలంగా దెబ్బతిన్న కచ్చా, గృహాలను, నూతనంగా నిర్మిస్తున్న  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని పరిశీలించారు. స్థానికంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వరదల సమయంలో చేపట్టిన సహాయ కార్యక్రమాలు గూర్చి డాక్టర్ శ్రీవల్లిని అడిగి తెలుసుకున్నారు.ఏపీ విపత్తుల స్పందన నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో పోస్ట్ డిజాస్టర్ నీడ్స్ అసెస్‌మెంట్ బృందం సంబంధిత శాఖల క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయంతో నిర్దేశించిన విధంగా శాఖల వారీగా డేటాను సేకరించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు. వరద ప్రభావిత కోనసీమ జిల్లాను బృందం  సందర్శించి,వివిధ రంగాల వారీగా సేకరించిన డేటాను క్రాస్ చెక్ చేయడానికి మరియు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పునరు ద్ధరణ మరియు పునర్నిర్మాణ ప్రణాళికను సిద్ధం చేయడానికి సాంకేతిక సహాయం మరియు మార్గదర్శకాలను అందించడానికి,  అంబేద్కర్ కోనసీమ వరద ప్రభావిత జిల్లాలో పోస్ట్ డిజాస్టర్ నీడ్స్ అసెస్‌మెంట్  ఎక్సర్‌సైజ్‌లో భాగంగా, బృందం వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిoదన్నారు.  కోనసీమ జిల్లాలో రంగాల వారీగా సేకరించిన డేటాను క్రాస్ చెక్ చేయడానికి మరియు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పునరుద్ధరణ మరియు పునర్నిర్మాణ ప్రణాళికను సిద్ధం చేయడానికి సాంకేతిక సహా యం చేస్తోందన్నారు.  వరదలు కారణంగా దెబ్బతిన్న వాటికి సంబంధించి నిధులు కోరే విష యంలో తాత్కాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలతో కూడిన సమగ్ర నివేదికను సమర్పించాలని, కేంద్ర ప్రభుత్వం తరపున పూర్తిస్థాయిలో ఆదుకో వడానికి అనువుగా చర్యలు బృం దం తీసుకుంటుంద


న్నారు.  ఎన్డి ఎమ్ఏ జూనియర్ కన్సల్టెంట్ జావేద్ ఇక్బాల్, మెడికల్ ఆఫీసర్  అవనిత్ తో కూడిన బృందం ఈ ఏడాది జూలై, ఆగస్ట్ నెలలో సంభ వించిన వరదలు మూలంగా వివిధ శాఖలకు చెందిన నష్టాలుపై జాతీ య విపత్తు నిర్వహణ సంస్థ మరి యు ఇండియా ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో పి గన్నవరం మండ లంలో పర్యటించిందని,  క్షేత్రస్థాయి అంశాలు మరింతగా విశ్లేషణ చేసే దిశలో మొత్తం వివరాలు, ప్రస్తుతం వాటిల్లిన నష్టం, తాత్కాలిక పునరు ద్దరణ, శాశ్వత పరిష్కారం తదితర అంశాల వారీగా విడివిడిగా నివేది కల రూపకల్పన చేయాలని ఆదేశిం చిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా ల విపత్తు నిర్వహణ విభాగాలు గోదావరి వరద నష్టాల అంచనాలపై  కోనసీమ జిల్లాకు వచ్చి అధ్యయనం చేయడం జరిగిందని ప్రాధానంగా దెబ్బతిన్న విద్య ఆరోగ్య పరమైన భవనాలు, గృహలు రోడ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటి శాశ్వత నిర్మాణాల కొరకు ప్రాక్టికల్గా అధ్యయనం చేయడం జరిగింద న్నారు. ఈ పర్యటనలో వాస్తవ పరిస్థితులను తెలుసుకోవ డంతోపాటు ఈ పర్యటన అనం తరం  ముందస్తు నివేదిక, అధ్యయ న బృందం సిఫార్సులు, క్షేత్రస్థాయి సందర్శన క్రోడీకరించి, కేంద్ర ప్రభు త్వానికి నివేదిక అంద జేస్తాయ న్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా  అధికంగా వర్షాలు కురిసి నందున, గోదావరి పరివాహక ప్రాంతాల్లో  ఉన్న ప్రాంతాలు వరదల ముంపునకు గురి అయినట్లు ఆయన బృందానికి వివరించారు. కె ఏనుగుపల్లి గ్రామస్తులు తమ గ్రామo వద్ద వరదల సమయంలో రాకపోకలకు వీలుగా బ్రిడ్జి నిర్మించాలని బృంద సభ్యులను ముక్తకంఠంతో కోరారు. గృహాలు,పక్కా గృహాలు, తాటాకు ఇల్లు తదితర ఆర్ అండ్ బి,  పి ఆర్, త్రాగునీటి వ్యవస్థ, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, విద్యుత్, ఇరిగేషన్ , ఆరోగ్యం తదితర శాఖ లకు చెందిన మౌలికసదుపాయాలు, వసతులకు నష్టం వాటిల్లిందని శాశ్వత ప్రాతిపదికన అయ్యే ఖర్చుతో ప్రతిపాదనలు, పూర్తి స్థాయిలో అంచనా వేసిన నివేదిక ఇవ్వాలని బృందం కోరిందని భవిష్యత్తులో ఎటువంటి విపత్తులు ఎదురైన వాటిని శాశ్వతంగా అధిగమించే దిశగా అడుగులు వేస్తూ నివేదిక రచించాలన్నదే బృందం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. కార్యని ర్వాహక సంచాలకులు, సి నాగరా జు,రాష్ట్ర సమగ్ర శిక్ష అభియాన్ సభ్యులు డి.వి నరసింహారావు, కొత్తపేట ఆర్డిఓ ఎం ముక్కంటి, గృహ నిర్మాణ సంస్థ పథక సంచాలకులు నాగభూషణం శ్రీనివాసు గ్రామీణ నీటి సరఫరా విభాగం సూపరింటెండెంట్ ఇంజనీర్ సిహెచ్ ఎన్వి కృష్ణారెడ్డి డివిజనల్ ఇంజనీర్ పద్మనాభం జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ వి రవి సాగర్, ఎంపీడీవో వెంకటాచారి తాసిల్దార్ రవీంద్రనాథ్ ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు.

Comments