ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య సేవలు అందజేస్తున్నాం

 *ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య సేవలు అందజేస్తున్నాం


*

*•75 ఏళ్ల సమస్య పరిష్కారానికి జగనన్న ప్రభుత్వం యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నది*

*•పలాసలో చేపట్టిన 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి 2023 మార్చి నాటికి పూర్తిచేస్తాం*

*•రూ.742 కోట్లతో చేపట్టిన ఉద్దానం సురక్షిత మంచినీటి ప్రాజెక్టు 2023 మార్చి కల్లా సిద్దం*

*•కిడ్నీవ్యాధికారకాలను గుర్తించేందుకు జిఐజిహెచ్, టిఇఆర్ఐ, ఐసిఎంఆర్ తో త్రైపాక్షిక ఒప్పందం*

*•వచ్చే వారంలో మద్యంతర నివేదికను అందజేయనున్న బృందం*

*రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం & వైద్య విద్య శాఖ మంత్రి విడదల రజిని*


అమరావతి, అక్టోబరు 26 (ప్రజా అమరావతి):  శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య సేవలు అందజేయడంలో జగనన్న ప్రభుత్వం యుద్ద ప్రాతిపధికన చర్యలను తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. 75 ఏళ్ల సమస్య పరిష్కారానికి జగనన్న ప్రభుత్వం గత మూడేళ్ల నుండి అవిశ్రాంతంగా కృషిచేస్తున్నదని, ఈ సమస్య పరిష్కారానికి గత ప్రభుత్వం చేసింది శూన్యం అని ఆమె స్పష్టంచేశారు. బుధవారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో పాత్రికేయులతో ఆమె మాట్లాడుతూ 2019 లో జగనన్న ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్దానం కిడ్నీ సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. మూత్ర పిండాల వ్యాధి గ్రస్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో  2019 సెప్టెంబర్ మాసంలో  రూ.50 కోట్ల అంచనా వ్యయంతో పలాసాలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాకి రాష్ట్ర ముఖ్యమంత్రి  శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారన్నారు.  ఈ ఆసుపత్రి నిర్మాణ పనులు 75 శాతం పైబడి పూర్తి అయ్యాయని,  వచ్చే ఏడాది మార్చి మాసానికల్లా  ఈ ఆసుపత్రి సేవలు అందుబాటులోకి రానున్నట్టు ఆమె తెలిపారు. అదే విధంగా ఉద్దాన ప్రాంతంలోని ఇచ్చాపురం, కవిటి, సోంపేట, కంచిలి, మందస, పలాస మరియు వజ్రపుకొత్తూరు తదితర ఏడు మండలాల్లోని నివాశిత ప్రాంతాల ప్రజలకు సురక్షితమైన త్రాగునీటిని సరఫరా చేయాలనే లక్ష్యంతో  రూ.742 కోట్ల అంచనా వ్యయంతో సర్పేస్ వాటర్ ప్రాజెక్టు నిర్మాణానికి జగనన్న ప్రభుత్వమే శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టు పనులు కూడా 80 శాతం వరకూ పూర్తి అయ్యాయని, వచ్చే ఏడాది మార్చి నాటికల్లా ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రానున్నట్లు ఆమె తెలిపారు. ఉద్దాన ప్రాంతంలోని అన్ని గ్రామాలకు 142 ఆటోమేటెడ్ వాటర్ డిస్పెన్సర్ల ద్వారా 24 గంటలూ సురక్షిత త్రాగునీటి పంపిణీచేస్తున్నామన్నారు. ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీవ్యాధికారకాలను గుర్తించేందుకు జార్జి ఇన్ స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ (జిఐజిహెచ్), న్యూడిల్లీకి చెందిన టిఇఆర్ఐ మరియు ఐసిఎంఆర్ తో త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు. వచ్చే వారంలో ఈ బృందం ప్రభుత్వానికి తమ  మద్యంతర నివేదికను అందజేయనున్నట్లు ఆమె తెలిపారు. 


*రెగ్యులర్ గా స్క్రీనింగ్స్ చేస్తున్నాము, మెరుగైన వైద్య సేవలు అందజేస్తున్నాం….*


ఉద్దాన ప్రాంతంలోని ఇచ్చాపురం, కవిటి, సోంపేట, కంచిలి, మందస, పలాస మరియు వజ్రపుకొత్తూరు మండలాల్లోని 18 ప్రాధమిక ఆరోగ్య  కేంద్రాలు, 5 ప్రాధమికోన్నత ఆరోగ్య కేంద్రాలు మరియు 6 సామాజిక ఆరోగ్య కేంద్రాలలో మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య సేవలను అందించడం జరుగుచున్నదని మంత్రి తెలిపారు. ప్రాధమిక దశలోనే దీర్ఝకాలిక మూత్రపిండాల వ్యాధి గ్రస్తులను గుర్తించి వారికి అవసరమైన ఔషదాలను అందించాలనే ఉద్దేశ్యంతో  ఉద్దానం ప్రాంతంలో రెగ్యులర్ గా స్క్రీనింగ్ చేయడం జరుగుచున్నదన్నారు. ఇప్పటి వరకూ 1 లక్షా 25 వేల 506 మందికి స్క్రీనింగ్ లు  పూర్తిచేసి, 21,861 మందికి వైద్య సేవల నిర్వహణ మరియు 791 మందికి డయాలసిస్ సేవలను అందజేయడం జరుగుచున్నదని ఆమె తెలిపారు. సీరం క్రియాటిన్, రక్తం యూరియా స్థాయిలను పరీక్షించేందుకు సెమీ ఆటో ఎనలైజర్స్ తో  17 లేబొరేటరీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ సంబందిత అధికారులతో సమగ్ర సమీక్ష అనంతరం అదనంగా  మరో 11 ఎనలైజర్స్ కొనుగోలుకు చర్యలను చేపట్టడం జరిగిందన్నారు.  కవిటి, సోంపేట, పలాస, హరిపురం సి.హెచ్.సి.లు మరియు టెక్కలి జిల్లా ఆసుపత్రిలో 65  డయాలసిస్ మెషిన్స్ తో 5 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసి  కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సేవలను అందజేయడం జరుగుచున్నదని ఆమె తెలిపారు.  డా.వైఎస్సార్ పించను కానుక క్రింద 3,4 దశల్లోని వ్యాధిగ్రస్తులకు రూ.5 వేలు, డయాలసిస్ చేయించుకుంటున్న వారి రూ.10 వేలను ప్రభుత్వం ప్రతి మాసం కిడ్నీ రోగులకు అందజేస్తున్నది ఆమె తెలిపారు. 


రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి  ఎం.టి.కృష్ణబాబు, కమిషనర్ జె.నివాస్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.



Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image